ఎవరూ ఊహించని దారుణమైన ఓటమి ఒక వైపు... కుట్రలు ఒక వైపు... ప్రజలకు ఎంత సేవ చేసినా, ఎందుకు ఓడిపోయామా అని అధినేత ఆవేదన ఒక వైపు.. అసలకే బాధలో ఉంటే, కార్యకర్తల పై వైసీపీ దాడులు.. చంపటాలు, ఆస్తుల ధ్వంసాలు, ఇలా అనేకం... చంద్రబాబు అసెంబ్లీలో బిజీ.. లోకల్ నాయకులు, ఎందుకో కాని మౌనం... పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాధుడు లేడు... ఇలా బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న కార్యకర్తలకు, నేనున్నాను అంటూ, ఒక యంగ్ లీడర్ ముందుకొచ్చారు. సంక్షోభంలో నుంచే నాయకుడు పుడతాడు అనే మాట నిజం చేస్తూ, దేవినేని నెహ్రు వారసుడిగా, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా, కష్ట కాలంలో, కార్యకర్తలు కోసం నిలబడ్డాడు దేవినేని అవినాష్. గుణదల నుంచి, గురజాల వెళ్లి, కార్యకర్తలను పరామర్శించి, వాళ్లకు ధైర్యం చెప్పి, భరోసా ఇచ్చారు. ఈ పరిణామంతో, తెలుగుదేశం కార్యకర్తలు సంతోషిస్తున్నారు.

గుంటూరు, దాచేపల్లి మండలం గామాలపాడులో తలదాచుకొన్న మాచవరం మండలం కొనంకి, జూలకలు, పిన్నెల్లి గ్రామాలకు చెందిన కార్యకర్తలను, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పరామర్శించి వచ్చారు. ఈ సందర్భగా అవినాష్ మాట్లాడుతూ కొత్తగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ దాడులు పెరిగాయని అన్నారు. రాజకీయాల్లో గెలవటం ఓడిపోవటం సహజమన్నారు. అధికారంలోకి రాగానే కక్షసాధింపు చర్యలకు దిగటం మంచిది కాదన్నారు. ఇలాగే దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని దేవినేని అవినాష్‌ స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో సంప్రదించి కార్యకర్తలకు మనోధైర్యం నింపేందుకు వచ్చినట్లు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులతో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, ఇతర నాయకులు మాట్లాతారన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read