ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని కోర్టుకి చెప్పిన సీబీఐ ఏమైంది? ముందస్తు బెయిల్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు హైకోర్టుకి పంపింది. హైకోర్టు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అయినా అవినాష్ రెడ్డి అరెస్టు జరగలేదు. అన్నికోర్టుల్లోనా అవినాష్ రెడ్డి నిందితుడు అని అఫిడవిట్లు వేసిన సీబీఐ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో పూర్తిగా మౌనం దాల్చేసింది. దీని వెనుక ఏదో అదృశ్యశక్తి ఉందంటూ ఏబీఎన్ ఆర్కే తన కొత్త పలుకులో రాశారు. ఆయన పేరు రాయకపోయినా కేంద్రంలో ఉన్న బీజేపీయే ఆ అదృశ్యశక్తి అని ఏపీలో చిన్నపిల్లాడికి సైతం తెలుసు. తన తండ్రిని చంపేశారని రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేయించిన జగన్ రెడ్డి అదే రిలయన్స్ వాళ్లకి రాజ్యసభ సీటిచ్చారు. ఆయనే పరిమళ్ నత్వానీ. రిలయన్స్ తరఫున లాబీయింగ్ చేసే కింగ్ పిన్. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో సీబీఐపై ఒత్తిడి తెచ్చి వివేకానందరెడ్డి కేసు నీరుగార్చేందుకు, అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా ఉండేందుకు జగన్ రెడ్డి కోసం పనిచేసిన మొదటి అదృశ్యశక్తి. ఒక కన్నుని పొడిచిన మరో కన్ను అరెస్ట్ తప్పదనుకునే సమయంలో ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడు అదానీతో జగన్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మరో అదృశ్యశక్తి పనిచేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి హాయిగా తడిగుడ్డ వేసుకుని ఇంట్లో పడుకున్నాడు. తనను ఏ సీబీఐ ఏం చేయలేదనే ధైర్యంతో వీడియోలు విడుదల చేస్తున్నాడు. అన్ని అదృశ్యశక్తులు కలిసి..వివేకానందరెడ్డి ఆత్మహత్యచేసుకున్నాడని కేసు క్లోజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఏపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదృశ్యశక్తి పనిచేసిందా ? అవినాష్ రెడ్డి అరెస్టు ఆగిపోయిందా ?
Advertisements