వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌కేసులో మ‌రోసారి క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డి పిలుపు వ‌చ్చింది. ఇటీవ‌లే సీబీఐ విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించార‌ని ప‌రిణామాలు స్ప‌ష్టం చేశాయి. మ‌ళ్లీ విచార‌ణకి పిల‌వ‌డంతో ఈ సారి అరెస్టు త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హ-త్య కేసులో సిబిఐ దూకుడు పెంచేసింది. మరో మారు విచారణకు హాజరు కావాలంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు వాట్స‌ప్ ద్వారా పంపింది. ఈనెల 24న సాయంత్రం మూడు గంటలకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. హైదరాబాదులోని సిబిఐ కార్యాలయానికి హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది సిబిఐ. గతంలో 9 గంటల పాటు అవినాష్ రెడ్డి ని విచారించిన సీబీఐ, భార‌తి పీఏ న‌వీన్‌, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహ‌న్ రెడ్డిని పిలిచింది. ఈ నేప‌థ్యంలో రెండోసారి అవినాశ్ రెడ్డిని విచార‌ణ‌కి పిల‌వ‌డంతో కీల‌క ఆధారాలు దొరికాయ‌ని, ఈ సారి అరెస్టు త‌ప్ప‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read