వైఎస్ వివేకానందరెడ్డి హ-త్యకేసులో వైసీపీ క్యాంపు ఎత్తుగడలు ఒక్కొక్కటి నేరస్తుల ఆచూకీ చెబుతున్నాయి. గతంలో వివేకా హ-త్యపై ఎవరూ మాట్లాడకూడదని కోర్టుకెళ్లి గాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు వైఎస్ జగన్ రెడ్డి మనుషులు. ఇప్పుడు వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయకుండా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ ఆయనతోనే దాఖలు చేయించారు. దీంతో రెండు విషయాలను అవినాశ్ రెడ్డి ఒప్పుకున్నట్టయ్యింది. ఒకటి రేపు సీబీఐ అరెస్ట్ చేయడం తప్పదనేది, రెండోది విచారణ సందర్భంగా వివేకానందరెడ్డి హ-త్యలో తన పాత్రని ఒప్పుకున్న సంగతి అని అనుమానాలు వస్తున్నాయి. విచారణకి మూడోసారి పిలిచినప్పుడు మీటింగ్ల పేరుతో నాన్చుతున్నప్పుడే ఏదో తప్పించుకునే వ్యూహం పన్నుతున్నారని చాలా మంది ఊహించారు. అనుకున్నట్టే విచారణకి ఒక రోజు ముందు తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రేపు సీబీఐ విచారణకు హాజరుకానున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సిబిఐ విచారణలో ఆడియో వీడియో రికార్డ్ చేయాలని, న్యాయవాది సమక్షంలో విచారించాలని కోరారు. అవినాష్ రెడ్డికి సిఆర్పిసి 160 కింద నోటీసు సిబిఐ అందజేయడంతో అరెస్టు తప్పదని నిర్ణయించుకున్న అవినాష్ రెడ్డి చివరి ప్రయత్నంగా హైకోర్టు తలుపు తట్టారు.
అవినాశ్ అరెస్ట్ తప్పదా? ఏమి జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వైసీపీ..
Advertisements