వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి త్వరలో కడిగిన ముత్యంలా అన్న చెంతకి రావడం ఖాయమని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. మూడుసార్లు విచారించిన సీబీఐ బాబాయ్ హత్యకేసులో అబ్బాయ్ హస్తంలో కీలక ఆధారాలు దొరకడంతో నేడో రేపో అరెస్టు చేస్తుందనుకున్న దశలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాతో భేటీ అయ్యారు. వెంటనే దర్యాప్తు అధికారిని మార్చాలని అవినాష్ రెడ్డి కోరడం, సుప్రీంకోర్టు జడ్జి కూడా దర్యాప్తు అధికారినే మార్చాలని పట్టుబట్టి మార్చేశారు. అరెస్టు కావాల్సిన అవినాష్ రెడ్డి హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్రమంత్రి గడ్కరీని కలిసి వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఇక సీబీఐ తన జోలికి రాదని ఎవరో గట్టిగా భరోసా ఇచ్చినట్టున్నారు. టూర్లు మీద టూర్లు వేస్తున్నారు. తన అన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటికి కూడా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. సీబీఐ అవినాష్ రెడ్డి తండ్రిని కూడా విచారణకి పిలిచింది. ఆయన వెళ్లలేదు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని కోర్టులో అఫిడవిట్ వేసింది. అదీ చేయలేదు. అంటే అన్న జగన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ పర్యటన విజయవంతమైనట్టేనని, అవినాష్ రెడ్డి సేఫ్ అని వైసీపీలో అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయి
అవినాష్ రెడ్డిని సిబిఐ వదిలేసిండా ? స్పీడ్ తగ్గటం వెనుక అసలు కారణం ఇదా ?
Advertisements