ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ థ్రిల్లర్ గా నడుస్తున్న వివేకా కేసు, చివరి అంకానికి చేరుకుంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ కేసులో విచారించిన సాక్ష్యులు, నిందితులు, బాధితుల్లో మెజారిటీ అవినాష్ రెడ్డి వైపే వేళ్ళు చూపిస్తున్నారు. దీంతో అవినాష్ రెడ్డిని విచారణ చేయటానికి సిబిఐ సిద్ధం అయ్యింది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని విచారణకు పిలుస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న ఉదయం ఢిల్లీ నుంచి కొంత మంది సిబిఐ ఉన్నతాధికారులు పులివెందుల వచ్చారు. అవినాష్ రెడ్డిని విచారణ చేసేందుకు, వారు మొత్తం సిద్ధం చేసుకుని వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే స్పీకర్ దగ్గర కూడా వారు పర్మిషన్ తీసుకున్నట్టు సమాచారం. అయితే నిన్న పులివెందుల వచ్చిన సిబిఐ అధికారులు, వైఎస్ అవినాష్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారని, అయితే సిబిఐ ఇచ్చిన నోటీసులను, అవినాష్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ తీసుకోలేదు అంటూ, ఈ రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. సిబిఐ ఇచ్చిన నోటీసులు, కేవలం అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని విచారణ చేయటానికే. మరి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఎందుకని, విచారణకు హాజరు కావటానికి ఇష్టపడటం లేదో, ఎందుకని వారు సిబిఐ ఇచ్చిన నోటీసులను తిరస్కరించారో తెలియాల్సి ఉంది.

avinash 04032022 2

ఇది ఇలా ఉంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తాము ఇచ్చిన నోటీసులు తిరస్కరించటంతో, సిబిఐ అధికారులు రూట్ మార్చారు. వీరికి కోర్టు ద్వారానే నోటీసులు ఇప్పించి, అప్పుడు విచారణకు పిలిపించాలని సిబిఐ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సిబిఐ అధికారులు నిన్నే ఇదే విషయం పైన, కడప జిల్లా కోర్టుని ఆశ్రయించారు. ఈ కోర్టు కడప కోర్టు అనుమతి ఇస్తే, ఈ రోజు అవినాష్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చి, వారిని విచారణకు పిలిచేందుకు సిబిఐ సిద్ధం అయ్యింది. ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం, వివేక చనిపోయిన రోజు, అక్కడ రక్తం శుభ్రం చేపించింది, కుట్లు వేయించింది, గుండె పోటు అని ప్రచారం చేసింది, ఇలా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా అవినాష్ రెడ్డి దగ్గర ఉండి చేపించారని, ఇప్పటి వరకు సిబిఐకి అనేక మంది ఇచ్చిన స్టేట్మెంట్. ఆధారాలు ఎందుకు ధ్వంసం చేసింది, అవినాష్ రెడ్డిని అడగాలని సిబిఐ భావిస్తుంది. మరి మీడియా ముందు అనేక విషయాలు చెప్పే వైసీపీ నేతలు, ఎందుకు సిబిఐ విచారణకు హాజరు అయ్యి ఆ విషయాలు చెప్పటం లేదో మరి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read