వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సీబీఐతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆడుతున్న దొంగా-పోలీస్ ఆటలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చేసింది, చేయించింది ఎవరో సీబీఐ అఫిడవిట్ల ద్వారా చెప్పకనే చెప్పేసింది. నిందితులంతా అరెస్ట్ తప్పదని ఫిక్సయిపోయారు. కింగ్ పిన్ అయిన అవినాశ్ రెడ్డి ఏ ఎంపీ సీటు కోసం వివేకానందరెడ్డిని చంపేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో, అదే హత్యకేసులో అరెస్టయితే దానిని సానుభూతి పొందేలా వాడుకోవాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ కేసులో అదృశ్యశక్తి ద్వారా అంతా నడిపిస్తున్న అన్న సూచనల మేరకు సీబీఐతోనే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారనే సామాన్యులు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎవరెవరిని, ఏ కోణంలో విచారించాలో అవినాష్ రెడ్డి చెబుతుంటే, సీబీఐ అదే చేస్తోంది. విచారణకి తాను ఏ తేదీన రావాలని అనుకుంటున్నాడో అదే తేదీన రమ్మంటోంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయని చెబితే సీబీఐ విచారణ నుంచి మినహాయింపు ఇస్తోంది. వీటన్నింటినీ చూశాక, సామాన్యులకి కూడా అర్థం అవుతున్న విషయం ఏంటంటే, ఈ కేసులో అవినాష్ రెడ్డిని కాపాడటానికి ఏపీలో సర్కారీ పెద్ద, కేంద్ర పెద్దలు బాగానే కృషి చేస్తున్నారని తేలిపోతోంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, సీబీఐ ఎప్పుడు, ఎక్కడ, ఎలా తనను అరెస్ట్ చేయాలో అవినాష్ రెడ్డి నిర్దేశిస్తున్నట్టు వరస పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో తన బదులు అభిషేక్ రెడ్డి బాద్యతలు చూస్తారని అప్పగింతలు చేసి వచ్చిన అవినాష్ రెడ్డి...తన అరెస్టు తన జనం మధ్యలో జరిగేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. జనం నుంచి సానుభూతి పొంది వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు మార్గం సుగమం అవుతుందని, అందుకే సీబీఐతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తెలుస్తోంది.
ప్లాన్ మార్చిన అవినాష్ రెడ్డి.. అసలు సిబిఐ లెక్క ఏంటి ?
Advertisements