కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అఫిడవిట్ల ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కీలక నిందితుడు. అయినా తనకే పాపం తెలియదంటూనే ఉన్నాడు. పాపం తెలియనప్పుడు, హత్య చేయించనప్పుడు సీబీఐ విచారణని తప్పించుకోవడానికి ఇన్ని ఎత్తులు ఎందుకు వేస్తున్నాడనేది అందరినీ తొలిచేసే ప్రశ్న. సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులలో తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. అవన్నీ కొట్టేశారు. ఇతరులతోనూ వివిధ కోర్టుల్లో లెక్కకుమించిన పిటిషన్లు వేయించారు. అవీ పోయాయి. చిట్టచివరి అవకాశంగా సుప్రీంకోర్టు దారి కూడా మూసుకుపోయింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మెన్షనింగ్ లిస్ట్ లో ఉంటేనే విచారిస్తామన్న న్యాయమూర్తి సంజయ్ కరోల్, అనిరుద్ బోస్ ధర్మాసనం స్పష్టం చేసింది. మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని సూచించడంతో సీబీఐ అరెస్టుకి లైన్ క్లియర్ అయ్యింది. అయినా తాను విచారణకి ఏడు రోజుల తరువాత వస్తానంటూ మళ్లీ కొత్త రాగం అందుకోవడం, తన తల్లికి సీరియస్గా ఉందని చెప్పడంతో మరో డ్రామాకి అవినాష్ రెడ్డి తెరలేపారని స్పష్టం అవుతోంది.
ఎన్ని కోర్టులు ఛీకొట్టినా ఏంటి అవినాష్ రెడ్డి ధైర్యం
Advertisements