జగన్ మోహన్ రెడ్డి కొత్త పోరాటానికి సిద్ధమయ్యారు... అదే అవినీతి పై పోరాటం.. ఈ రోజు ప్రభుత్వ ఇంజినీరింగ్ నిపుణులతో, ప్రాజెక్ట్ ల పై సమీక్ష నిర్వచించారు. ఆ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ చెడిపోయిన వ్యవస్థలను బాగు చెయ్యటం కోసమే నేను ఉన్నానని అన్నారు. వ్యవస్థలను బాగు చెయ్యటానికే కంకణం కట్టుకున్నానని, దేశం మొత్తం మన వైపే చూడాలని అన్నారు. ప్రాజెక్ట్ ల విషయంలో తన పైనే ఒత్తిడి తెచ్చారని, నన్నే చూసీచూడనట్టు పోవాలని చెప్పారని, అయితే నా దగ్గర అవినీతి అనే మాట ఉండదని చెప్పానని జగన్ అన్నారు. అందుకే అవినీతి పై పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకునన్నాని జగన్ చెప్పారు. అసలు అవినీతి అంటే ఏంటో తన ప్రభుత్వంలో, ప్రజలకు తెలియకూడదని, ఇందుకోసం అధికారులు తనతో కలిసి రావాలని జగన్ అన్నారు. అందుకే రివెర్స్ టెండరింగ్ విధానం తెస్తున్నామని జగన్ అన్నారు.
తన సొంత పత్రిక సాక్షిలో, చంద్రబాబు అవినీతి చేసారంటూ వచ్చిన కధనాలు అధికారులుకు చూపించి, దీని సంగతి చూడండి అని ఆదేశించారు. సాక్షిలో వచ్చిన కధనాలు చూసి, దాని పై నిజానిజాలు వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. అయితే జగన్ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. 31 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, అవినీతి పై పోరాటం చేస్తానని అంటాడు ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అవినీతి చేసాడు అంటూ హడావిడి చేసి, అధికారంలోకి వచ్చి నెల రోజులు అయినా, ఒక్క రూపాయి అవినీతి నిరూపించలేక, సెక్రటేరియట్ ఉద్యోగులను, మీరు చంద్రబాబు చేసిన అవినీతి ఏమన్నా చెప్తే, సన్మానం చేస్తాను అని చెప్పటం చూస్తుంటే, జగన్ పరిస్థితి అర్ధమవుతుందని అంటున్నారు. అవినీతి లేన పరిపాలన చేస్తే అందరికీ సంతోషమే అని, కాని జగన్ లాంటి వారు ఈ మాటలు చెప్తుంటే, వింతగా ఉందని అంటున్నారు.