ఆల్ రోడ్స్ లీడ్ టూ రోమ్ అనే నానుడి ప్రపంచ వ్యాప్తంగా ఉంటే, ఆల్ ది కరప్టడ్ కనెక్ట్ టుది జగన్ అనేది రాష్ట్రంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా తెలియాల్సిన సమయం వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే " గత పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అవినితి కేసులను స్టడీ చేస్తున్నాను కాబట్టి, ఆ అనుభవంతోనే జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర దేశవిదేశాల్లో చర్చించబడుతోందని చెబుతున్నాను. ఈ విషయం రాష్ట్రప్రజలకు తెలుసా..లేదా అనేది తెలియాలి. సీబీఐ జగన్ పై 11కేసులు వేసింది... ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకి హాజరవుతున్నారు. అలాంటి వ్యక్తి ఏనాడైనా ఒక ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, తాను అవినీతిపరుడిని కానని, రూ.43వేలకోట్లు అవినీతి చేశానని సీబీఏ చెప్పింది.. అదంతా తప్పని ఎందుకు చెప్పలేదు? గత సంవత్సరం ముఖ్యమంత్రి, తన బంధువు, రాంకీ గ్రూప్ ఛైర్మన్ అయిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డిని రాజ్యసభకు పంపా రు. పెద్దల సభకు, ముఖ్యమంత్రి ప్రశ్నార్థకమైన అయోధ్యరామిరెడ్డిని పంపారు. అయోధ్యరామిరెడ్డి కంపెనీల్లో ఈడీ తనిఖీలు చేస్తే, రూ.300 కోట్ల లెక్కలులేని సొమ్ము దొరికింది. రూ.1200కోట్లకు సంబంధించి కృత్రిమ నష్టాలుచూపి, రూ.300 కోట్లపన్ను ఎగవేయాలని అయోధ్యరామిరెడ్డి ప్రయత్నించారని ఈడీ చెప్పింది. అలాంటి వ్యక్తిలోఉన్న ఆ గొప్పలక్షణాన్నిచూసే జగన్మోహన్ రెడ్డి, అయోధ్యరామిరెడ్డిని రాజ్యసభకు పంపారా ? జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే రాజ్యసభకు పంపారో ఆయన బతుకు...బండారం బయటపడిందిగా. అయోధ్యరామిరెడ్డిని వెంటనే వైసీపీ నుంచి బర్తరఫ్ చేయాలని, రాజ్యసభ పదవి నుంచి తొలగించాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ఈడీ పట్టుకున్న రూ.300కోట్లుఎక్కడికి పోతోందనే ఆలోచన కూడా చేయాలి. మొన్నీమధ్యనే చెన్నైలో కోట్లాది రూపాయల హవాలా సొమ్ము పట్టుబడింది. ఏపీలోని నల్ల డబ్బంతా జగన్మోహన్ రెడ్డి నేత్రత్వంలో చెన్నైకి, అటునుంచి విదేశాలకు వెళుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇన్ కంటాక్స్ అధికారులు ఈ విధమైన తరలింపుపై కూడా దృష్టిపెట్టాలి.
చెన్నైనుంచి డబ్బంతా ఎటువెళుతోందనే దానిపై నిఘాపెట్టాలి. చెన్నైలోనే ఏదైనా ప్రదేశంలో దాచిపెడుతున్నారా? నల్ల డబ్బుని తెల్లడబ్బుగా మారుస్తారు. ఎక్కడెక్కడో లాభాలు వచ్చినట్లు చూపుతారు. మరీ ముఖ్యంగా పత్రికా రంగంలో ఏ పత్రికకు లాభాలురావు.. సాక్షి పత్రికకు తప్ప. ముఖ్యమంత్రి, ఆయన బృందం దేశ ఆర్థిక వ్యవస్థకే పెను సవాల్ గామారింది. ఒకవైపు ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వడానికి డబ్బులేదంటున్నారు. మరోపక్కన రూ.300కోట్లు దొరికాయి... అలాదొరికిన సొమ్ము ప్రభుత్వ ఖజానాకువెళ్లి, ప్రజలకు అందాలి. అప్పుడే ఈడీ చర్యలు సఫలీకృతమైనట్లు. ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయనిచెప్పి, నిన్న లేఖరాశాను. దానిపై ఏ అధికారి, ఏమంత్రి మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం నడక, నడత అంతా ఎటుపోతోందో తెలియడం లేదు. రూ.300కోట్లు వైసీపీఎంపీ ఇంటిలో దొరికితే, దానిపై మాట్లడరా? 35ఏళ్లుఉద్యోగం చేసి, రిటైరయ్యాక కూడా ఉద్యోగి దగ్గర రూ.4లక్షలు ఉండటం లేదు. రూ.300కోట్లు కాజేసిన వ్యక్తిని కూర్చోబెట్టాల్సింది తీహార్ జైల్లోనేకదా? దీనిపై ముఖ్యమంత్రి ఏం చేస్తాడో చూడాలి. అయోధ్యరామిరె డ్డి ముఖ్యమంత్రి కన్ను,చెవిలాంటివాడు. అలాంటి వ్యక్తిపై ఈ ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకుంటాడు? అయోధ్య రామిరెడ్డి దెబ్బకు ఢిల్లీలో అంతంతమాత్రంగా ఉన్న జగన్ రెడ్డి పరువు కూడా పోయింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీకి వెళితే, ఠీవీగా నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి వెళితే, ఎక్కడికక్కడే బెండు అవుతాడు. 151మందిఎమ్మెల్యే ల బలమున్న వ్యక్తి ఢిల్లీ వెళితే, అక్కడ గజగజలాడాలి. రెండేళ్ల తన పాలనలో ముఖ్యమంత్రి ఏఏవర్గాలకు ఏంచేశాడో చెప్పగలడా? ఢిల్లీనుంచి రాష్ట్రానికి ఏం సాధించాడో చెప్పగల డా? జగన్మోహన్ రెడ్డి అవినీతిపై విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో కూడా చర్చలు జరిగాయి.