ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎంపీకి ఐటి అధికారులు షాక్ ఇచ్చారు. వైసీపీ ఎంపీ, రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి ఇల్లు, ఆఫీస్ ల పై, ఏక కాలంలో ఐటి అధికారులు దాడులు చేయటం పై, సర్వత్రా చర్చ జరుగుతుంది. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే వైసీపీకి, తమ కోటరీలో అతి ముఖ్యమైన వ్యక్తి పై ఐటి దాడులు చేయటం విస్మయానికి గురి చేస్తుంది. అయోధ్య రామి రెడ్డి, దేశంలోనే సంపన్నుల ఎంపీల్లో టాప్ లో ఉండి, ఇప్పటికే దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. రాంకీ కార్యాలయంలో, ఐటి అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని తన సంస్థతో పాటుగా, అనుబంధ సంస్థల పై కూడా సోదాలు జరుగుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ ల పై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, గతంలో వీళ్ళు చేసిన నిర్మాణ ప్రాజెక్ట్ లు, లావాదేవీల పై ఐటి అధికారులు కూపీ లాగుతున్నారు. తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ లో ఉన్న అన్ని కంపెనీల లావాదేవీల పై కూపీ లాగుతున్నారు. ఇప్పటికే ఈ సంస్థ ఐటి సంస్థకు అడ్వాన్స్ గానే టాక్స్ కూడా చెల్లించింది. ఆ అడ్వాన్స్ కు సంబంధించిన ఐటి రిటర్న్స్ పైన కూడా ఆరా తీస్తున్నట్టు మీడియాకు సమాచారం ఉంది.

itraids 06072021 2

రెండేళ్ళ క్రితం కూడా రాంకీలో ఐటి సోదాలు జరిగాయి.అప్పట్లో 250 కోట్ల ఆస్తులు కూడా అటాచ్ చేసారు. ఇప్పుడు జరుగుతున్న ఐటి సోదాల్లో, ఏమి బహిరంగ పరుస్తారో చూడాలి. అయితే ఇది ఇలా ఉంటే, సెబి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే, రాంకీలో ఐటి దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా షేర్ ధర అసహజంగా పెరగటంతో, సెబి అంతర్గంగా విచారణ చేసింది. ఇక్కడ నుంచి మలేషియాలో ఉన్న కంపెనీకు నిధులు మళ్ళించినట్టు గుర్తించింది. దీని పై ఐటికి సెబి ఫిర్యాదు చేసిన తరువాతే, ఐటి రంగంలోకి దిగినట్టు సమాచారం. అయతే ఈ సోదాలు ఎప్పటి వరకు జరుగుతాయి అనేది చూడాలి. ఈ సోదాల్లో ఏమి దొరికాయి, ఎంత నిధులు గోల్ మాల్ జరిగింది అనేది, ఐటి అధికారులు చెప్పే దాకా తెలిసే అవకాసం లేదు. అయితే అయోధ్య రామిరెడ్డి, జగన్ కేసుల్లో కూడా ఒక నిందితుడుగా ఉన్నారు. ఆయన పై సిబిఐ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఇంకా సిబిఐ కోర్టులోనే విచారణా లో ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read