రాష్ట్రంలో కరోనా విలయతాండవానికి, ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయంతో బతకడానికి మూర్ఖుడైన మన ముఖ్యమంత్రే కారణమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. బుధవారం ఆయన తన సందేశాన్ని వీడియో రూపంలో విలేకరులకు పంపించారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ, కరోనా వస్తే ఏ ఆసుపత్రికి వెళ్లాలో తెలియడంలేదని, ఎక్కడ కరోనా చికిత్స అందిస్తున్నారో తెలియడంలేదని, చాలా ఆసుపత్రుల్లో కనీసం బెడ్లు కూడా దొరకడం లేదన్నారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో చూస్తున్నామని, మృత దేహాలను తరలించడానికి కూడా అంబులెన్సులు దొరకడం లేదన్నా రు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖమంత్రి, మూర్ఖుడైన ముఖ్యమం త్రికి ఆలోచన రావడం సిగ్గుచేటన్నారు. 16లక్షల మంది విద్యార్థులు, పది, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉందని, వారితో పాటు తల్లిదండ్రు లు, భోదనా,బోధనేతర సిబ్బంది కలుపుకొని సుమారు 40లక్షల మంది వరకు కరోనాకు గురయ్యే అవకాశముందని అయ్యన్న స్పష్టం చేశారు. 40లక్షలమందికి కరోనా వస్తే పరిస్థితి ఏమిటనే ఆలోచన ఇంగితం, ముఖ్యమంత్రికి, విద్యాశాఖమంత్రికి లేదా అన్నారు. కరోనా రెండోదశ వ్యాప్తి చాలావేగంగా, ప్రమాదకరంగా ఉందని, చిన్నపిల్లలు కూడా వైరస్ బారినపడుతున్నారన్నారు. పరీక్షలు వాయి దావేయాలని విద్యార్థులు, వారితల్లిదండ్రులు, ప్రతిపక్షపార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నా ముఖ్యమంత్రి మూర్ఖంగా ముందుకెళ్లాలని చూడటం ఏమిటన్నారు. ఎవరి మాటా వినకుండా ముఖ్యమంత్రికి ఇంతటి మూర్ఖత్వమేమిటని చింతకాయల ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్నారుల జీవితాలతో ఆటలాడటం ముఖ్యమంత్రికి తగదని, ఎవరెంత చెప్పినా వినకుండా పరీక్షలు పెట్టే తీరుతామంటున్న ముఖ్యమంత్రి తీరుపై ప్రజలంతా కూడాఆలోచన చేయాలన్నారు.
అసెంబ్లీ సమావేశాలను, తిరుపతి ఉపఎన్నిక ప్రచారాన్ని కరోనా సాకుతో రద్దుచేసుకున్న ముఖ్యమంత్రి, తాను మాత్రం కరోనాకు భయపడుతూ, ఇతరులను మాత్రం దానికి బలిచేయాలని చూడటం ఏమిటన్నారు. జగన్ రెడ్డి కరోనాకు భయపడే ప్యాలెస్ నుంచి బయ టకు రావడంలేదని, ఎటువంటి సమావేశాలు, సభలు, పర్యటనలు లేకుండా కలుగులో దాక్కున్నాడని అయ్యన్నపాత్రుడు ఎద్దేవాచేశా రు. తనప్రాణాల గురించి అంతలా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి , పిల్ల ల ప్రాణాలను మాత్రం లెక్కచేయకపోవడం ఎంతమాత్రం సరికాద న్నారు. కరోనా నిబంధనలుఅనేవి ఎక్కడా అమలుకావడంలేదని, కళాశాలలు, పాఠశాలల్లో ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. అనేకమంది ఉపాధ్యాయులు ఇప్పటికే కరోనాకు గురయ్యారని, దాదాపు 110మందివరకు చనిపోయినట్లు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయని మాజీమంత్రి తెలిపారు. అనేక రాష్ట్రాలు పరీక్షలు వాయిదావేశాయని, ముఖ్యమంత్రి ఆదిశగా ఎందుకు నిర్ణ యం తీసుకోవడంలేదన్నారు. విద్యాశాఖ మంత్రి పరీక్షల గురించి మాట్లాడుతూ, ఏం భయంలేదంటూ వెటకారంగా మాట్లాడుతున్నా డని, అటువంటి పనికిమాలిన, చేతగాని మంత్రులుండబట్టే ప్రజల పరిస్థితి ఇంతదారుణంగా తయారైందన్నారు.
ఉపాధ్యాయ సంఘా లు చంద్రబాబునాయుడి హాయాంలో చీటికిమాటికీ గొడవలు చేసేవ ని, మరిప్పుడు ఆ సంఘాలన్నీ ఎందుకు ముఖ్యమంత్రిని నిలదీయడం లేదని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ఉపాధ్యాయులు చనిపోయినా విద్యార్థులు కరోనాకు గురవుతున్నా, తల్లిదండ్రులు భయాందోళనకు గురువుతున్నా ఉపాధ్యాయసంఘాలు ముఖ్యమంత్రిని కలిసి పరీక్షలు నిర్వహించవద్దని అడగకపోవడం ఏమిటన్నారు. ఉపాధ్యాయుల, ఆయా సంఘాలు ఒక్కసారి ఆత్మపరీశీలన చేసుకోవాలన్నారు. కేబి నెట్లో అనేకమంది సీనియర్ మంత్రులున్నారని, వారుకూడా ముఖ్యమంత్రికి చెప్పకపోతే ఎలాగని అయ్యన్నపాత్రుడు వాపోయా రు. ఏదైనా జరిగితే జరగబోయే దారుణాలకు ముఖ్యమంత్రే బాధ్యు డవుతాడనే వాస్తవాన్ని ఆయనకు అర్థమయ్యేలా మంత్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రే బాధ్యుడవుతాడని, అదేగానీ జరిగితే వారంతా ఈ మూర్ఖుడిని రోడ్డుపైనిలబెట్టే పరిస్థితి వస్తుందని మాజీమంత్రి హెచ్చరిం చారు. కాబట్టి ముఖ్యమంత్రి దీనిపై మూర్ఖత్వంతోకాకుండా మంచి తనంతో ఆలోచించాలని, పరీక్షలను వెంటనే వాయిదావేయాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.