ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరీ దిగజారి పోతుంది. అధికారంలో ఉన్న పార్టీ నేతలు బాధ్యత మరిచి చేస్తున్న వ్యాఖ్యలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు జుబుక్సాకరంగా ఉంటున్నాయి. అధికార పార్టీలో ఉన్న నేతలు, ముఖ్యంగా మంత్రులు మాట్లాడే మాటలు ఎంతో జాగ్రత్త మాట్లాడాలి. మొన్నటి దాకా వివిధ ప్రభుత్వాలు మంత్రులు మాట్లాడారు అంటే ఎంతో జాగ్రత్తగా మాట్లాడే వారు. ఎందుకంటే ఒక మంత్రి మాట్లాడుతున్నారు అంటే, అది ప్రభుత్వం మాట్లాడుతున్నట్టే లెక్క. అందుకే మంత్రులు బాధ్యతగా ఉంటారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు, ప్రధాన సలహదారులు, ఇవేమీ పాటించరు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు, గాలికి పోగేసిన మాటలు మాట్లాడుతూ, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పై, ఏమి జరిగిందో అందరూ చూసారు. సిసి టీవీ ఫూటేజ్ లో మొత్తం కనిపించింది. దాదాపుగా 10 మందికి పైగా ఎలా ప్రవర్తించారో చూసాం. అయితే ఈ ఘటన పై ప్రభుత్వ పెద్దలు ఎంత బాధ్యతగా మాట్లాడాలి ? ప్రభుత్వ పెద్దలు మాత్రం, ఈ ఘటన పై, పట్టాభి మీదే నెపం నెట్టారు. పట్టాభి కావాలని తన పై తానే, ప్లాన్ చేసుకున్నారని మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వ్యాఖ్యలు చేసారు. ఇదంతా డ్రామా అని అన్నారు.
మంత్రి కొడాలి నాని, చంద్రబాబు చేపించారని, లోకేష్ చేపించారని, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బాధ్యతగా మాట్లాడాల్సిన వాళ్ళు, ఇలా బాధ్యత లేకుండా మాట్లాడటంతో, తెలుగుదేశం పార్టీ దీటుగా సమాధానం చెప్పింది. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఘాటుగా స్పందించారు. బులుగు గొర్రెలు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాయి అంటూ ఘాటుగా బదులు ఇచ్చారు. గుడివాడ గొర్రె, గన్నవరం గొర్రెల డాటర్ వాగుతున్నారు అంటూ ఘాటుగా మాట్లాడారు. అలా అయితే రాజా రెడ్డి తన మీద తానే బాంబు వేసుకుని పోయాడా, పావురాలగుట్టలో పావురం అయ్యింది, తనకు తాను హెలికాప్టర్ పెల్చేసారా ? అమ్మా అంటూ బిగ్గరిగా కేక వేసిన జగన్, తనకు తాను కోడి కత్తితో గుచ్చుకున్నారా అంటూ, అయ్యన్న ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఆధారాలతో బాధ్యతగా మాట్లాడాలని, ఇలా గాలి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే, మిమ్మల్ని గాలి మంద, ఫేక్ మంద అంటారు అంటూ, వైసీపీ నేతల పై విరుచుకు పడ్డారు అయ్యన్న. మరి దీని పై, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.