చంద్రబాబునాయుడిపై కర్నూలు జిల్లాలో సుబ్బయ్య అనే న్యాయవాది అయిన ఒక పెద్దాయన కేసు పెట్టాడని, ఎన్ 440కే అనే కొత్తరకం వైరస్ వ్యాపిస్తోందని చెప్పి, మాజీ ముఖ్యమంత్రి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే ఆయన చేసిననేరమని ఫిర్యాదులో పేర్కొన్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ "ఎన్ 440కే గురించి ముందు చంద్రబాబునాయుడు చెప్పలేదు. క-రో-నా రెండోదశ వ్యాప్తిలో వైరస్ లో మరోకొత్త రకమైన ఎన్ 440కే ఉనికిని కనుగొన్నట్లు సీసీఎంబీ నిర్ధారించింది. అది దేశమంతా వ్యాపిస్తోందని కూడా అందరూ చర్చించు కుంటున్నారు. కొందరు పనికిమాలిన సన్నాసులేమో ఎన్ 440కే అనేదే లేదన్నట్లు మాట్లాడుతున్నారు. జాతీయ మీడియాలో ఒకవైపు కొత్తరకం వైరస్ ఎన్ 440 కే గురించి చర్చించారు. తెలంగాణ హైకోర్టు కూడా నేడు ఎన్ 440కే వైరస్ వ్యాప్తిపై, తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందని కూడా ప్రశ్నించింది. మే 4వ తేదీన హిందూ దిన పత్రికలో ఆంధ్రప్రదేశ్ ల కొత్తరకం వైరస్ ప్రవేశిస్తోందని, అది ఇప్పుడున్నదానికంటే 15రెట్లు ప్రమాదకరమని కూడా కథనం రాశారు. మే 2వ తేదీన టైమ్స్ఆఫ్ ఇండియా పత్రిక లో కొత్తరకం వైరస్ దేశవ్యాప్తంగా ఉప్పెనలా రాబోతోందని కూడా రాయడం జరిగింది. 6వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలో ఉనికిలో ఉన్న కొత్తరకం వైరస్ గురించి తెలుసుకోవాల్సి ఉందని మరోవార్త రాశారు. విశాఖపట్నంలో, రాష్ట్రంలోని ఇతరనగరాల్లో సంభవిస్తున్న వినాశ నానికి కొత్తరకం వైరస్సే కారణమని చర్చించుకుంటున్నారు. ఇంతమంది ఇన్నిరకాలుగా మాట్లాడుతుంటే, జాతీయ దినపత్రికలు, న్యూస్ ఛానళ్లు దానిపై చర్చిస్తుంటే, చంద్ర బాబునాయుడు ఒక్కడే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆయనపై కేసులు పెడతారా? ఆయన చెప్పిం ది ప్రజలను జాగ్రత్తగాఉండమని. అలా చెప్పడం ఆయన చేసిన తప్పా? మే 6, 8వ తేదీల్లో టైమ్స్ నౌ న్యూస్ ఛానల్ వారు ఈ వైరస్ వ్యాప్తిపై చర్చ నిర్వహించారు.
మే 4వతేదీన ఒన్ ఇండియా ఛానల్ వారు కూడా దీనిపై డిబేట్ నిర్వహిం చారు. పత్రికలు, ఛానళ్లు, చంద్రబాబునాయుడు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతమాత్రానికే చంద్రబాబుపై క్రిమినల్ కేసులు పెడతారా? సజ్జల రామకృ ష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి పనికిమాలిన వాళ్లు వాళ్ల నాయకుడికి డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. కర్నూల్లో చంద్రబాబుపై కేసుపెట్టిన న్యాయవాది కో-వి-డ్ సమయంలో సహాయం దొరక్క ఇబ్బందిపడుతున్న పేదల పక్షాన పోరాడాలి. అంతేగానీ సుబ్బయ్యకు ఇలాంటి పనులు తగునా? కర్నూల్లోనే మంత్రి జయరామ్ పేకాట క్లబ్బులు నడుపుతున్న సంగతి న్యాయవాది అయిన సుబ్బయ్యకు తెలియదా? మంత్రి పేకాటక్లబ్బులు నడుపుతుంటే మాట్లాడని వ్యక్తి చంద్రబాబుపై తప్పుడుకేసులు పెడతాడా? జయరామ్ కొన్నివేల ఎకరాల భూములను దోచేస్తే, ఏనాడూ సుబ్బయ్య ఆయనపై కేసుపెట్టలేదేం? మంత్రి, ఆయన కుటుంబసభ్యులందరూ కలిసి పేదల భూములు ఆక్రమించు కుంటున్నారని పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అవేవీ న్యాయవాది సుబ్బయ్యకు కనిపించలేదా? జయరామ్ తన శాఖకు సంబంధించి అవినీతికి పాల్పడి, బెంజ్ కార్ లో తిరుగుతుంటే, సుబ్బయ్య ఎందుకుస్పందించలేదు. తన సొంత జిల్లాకు చెందిన మంత్రి అవినీతిపై మాట్లాడలేని సుబ్బయ్య, చంద్రబాబుపై కేసుపెట్టడమేంటి? ఆయనచేసిన పనికి తోటిన్యాయవాదులు నవ్వరా?
క-రో-నా వల్ల కొన్ని లక్షలమంది చనిపోతున్నారు..అందుకుకారణం నాయకుల అసమర్థ, చేతగాని పాలనే. దానిపై ఎప్పుడైనా సుబ్బయ్య ఆలోచన చేశారా? ఢిల్లీలో ముస్లింలు 2వేలమందికి పైగా ఏదో సమావేశం పెట్టుకుంటే, వారివల్లే క-రో-నా వచ్చిందని నానాయాగీ చేశారు. మరి కుంభమేళాకు కొన్ని లక్షలమంది ని ఎలా అనుమతించారో చెప్పండి? క-రో-నా రెండోదశ వ్యాప్తి కి ప్రధానకారణం ఎన్నికలు కాదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఎన్నికలు పెడతారా? లక్షలమంది చనిపోవడానికి కారణం నాయకులు కారా? వారి అసమర్థత, చేతగానితనం కాదా? అటువంటి వారిపై వకీల్ సాబ్ సుబ్బయ్య ఎందుకు స్పందించడంలేదు? నిజంగా సుబ్బయ్యకు ప్రజలపై ప్రేమఉంటే, పరోక్షంగా లక్షల మంది చావులకు కారణమైన నాయకులపై కేసు పెట్టాలి. అంతేగానీ జాగ్రత్తగా ఉండమని చెప్పిన చంద్రబాబుపై పెట్టడమేంటి? అసమర్థ, అవినీతిపాలనను కప్పిపుచ్చుకోవడానికి ఈ దొంగ ముఖ్యమంత్రి, నీలాంటి వాళ్లతో కేసులు వేయిస్తాడని మాకు తెలుసయ్యా..సుబ్బయ్యా...! తన అసమర్థత గురించి ప్రజలు చర్చించుకోకూడదనేదే జగన్ ఆలోచన. పెట్టండి ఎన్నికేసులు పెడతారో? మీరెన్ని కేసులు పెట్టినా, మేం ఎప్పుడూ ప్రజలపక్షాన వారిసమస్యలపై పోరాడుతూనే ఉంటాము. సుబ్బయ్య లాంటి న్యాయవాదులు కో-వి-డ్ వల్ల, పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాలి. అంతేగానీ అసమర్థులైనవారికోసం తమ విలువైన సమయాన్ని వృథాచేసుకోవద్దని సూచిస్తున్నాం.