తెలుగుదేశం నేతల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. టిడిపి నేతలు మాట్లాడితే కేసు, బయట కాలు పెడితే కేసు, నుంచుంటే కేసు, కూర్చుంటే కేసు పెడుతూ టిడిపి నేతలను ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. వైసిపీ వచ్చి, టిడిపి వారిని కొట్టినా, ఎదురు టిడిపి పైనే కేసులు పెడుతున్నారు. ఇంకా ఆశ్చర్యం, టిడిపి నేతలదే తప్పు అని, పోలీసులు కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా ప్రతిపక్షం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఎక్కడైనా పోలేసులకు అధికార, ప్రతిపక్షాలు అనే తేడా ఉంటుందా ? అయితే వైసిపీ నేతలు బూతులు తిట్టినా, ఫేక్ చేసినా కేసులు మాత్రం ఉండవు. ఇలా ఉంది మన రాష్ట్రంలో రూల్ అఫ్ లా. పలు మార్లు హైకోర్టు ప్రశ్నించినా మార్పు రావటం లేదు. తాజాగా టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు పై, వైసీపీ మార్కు కేసులు దెబ్బ చూపించారు. అయ్యన్న పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వారం రోజులు క్రిందట కోడెల సభలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు కేసు పెట్టారు. కోడెల వర్ధంతి సభలో మాట్లాడిన అయ్యన్న, రాష్ట్రంలో జరుగుతున్న అధ్వాన పాలన, ఇష్టం వచ్చినట్టు చెత్త పై పన్ను, కరెంటు పన్ను, మటన్ షాపులు, సినిమా టికెట్ల పై ఆయన ప్రసంగిస్తూ, వైసీపీ నేతల పైన, జగన్ పైన విమర్శలు చేసారు.
ఈ స్పీచ్ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపింది. ఏకంగా చంద్రబాబు ఇంటి పై రాళ్ల దా-డి వరకు వెళ్ళింది. అయిన వైసీపీ నేతల కచ్చి తీరలేదు. ఇప్పుడు అయ్యన్న పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. హోం మంత్రి దిశ చట్టం ఉంది, శిక్షలు వేసాం అని అబద్ధాలు ఆడుతున్నారని, ఆడపిల్లల పై ఎక్కడ చూసినా దా-డు-లు జరుగుతున్నయాని, సిగ్గు ఉంటే హోం మంత్రి రాజీనామా చేయాలని అన్నారు. ఈ హోంమంత్రికి ఒక కానిస్టేబుల్ కూడా సెల్యూట్ చేయరని అన్నారు. దీని పైనే అయ్యన్న పై ఫిర్యాదు చేయగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వేముల ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు, పోలీసులు అయ్యన్న పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే అయ్యన్న మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తుతూనే ఉంటానాని, ఎక్కడ అదిరేది బెదిరేది లేదని, ఎన్ని కేసులు పెట్టినా, జగన్ అసమర్ధత పాలన పై మాట్లాడుతూనే ఉంటానని, ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ, అయ్యన్న ప్రకటన చేసారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.