మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పోస్కో విషయంలో విజయసాయి రెడ్డి టార్గెట్ గా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాటల్లో ? "ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ముఖ్యమంత్రి ఏంచేశాడనేది పట్టాభిగారు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇంతజరిగినా విజయసాయిరెడ్డి తనకేమీ తెలియనట్లు ఇప్పటికీప్రజలను మభ్యపెడుతూనేఉన్నాడు. ఇవన్నీ ఏ1, ఏ2లసమక్షంలోజరిగిన చీకటి ఒప్పందాలు. వారిస్వప్రయోజ నాలకోసం స్టీల్ ప్లాంట్ ను తాకట్టుపెట్టడానికి సిద్ధమయ్యారు. ఒక వ్యాపారవేత్త, దొంగ, అవినీతిపరుడు ముఖ్యమంత్రి అయితే, రాష్ట్ర సంపదఏమవుతుందో చెప్పడానికి విశాఖస్టీల్ ప్లాంట్ ఉదంతం ఒక్కటిచాలు. విశాఖపట్నంస్టీల్ ప్లాంట్ ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే ఏర్పడింది. మరెందరో రైతులు ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చారు. అటువంటి ప్లాంట్ ను కొట్టేయడానికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా అర్థంచేసుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకో వాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. విజయసాయిరెడ్డి పార్లమెం ట్ లోఅడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్పష్టంగా సమాధానం చెప్పినా కూడా,సిగ్గులేకుండా ఏ2ఇక్కడ పాదయాత్రలుచేస్తున్నాడు. 2019 అక్టోబర్ లోనే పోస్కో కంపెనీతో, ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ పై ఒప్పందం జరిగిందని కేంద్ర మంత్రి స్పష్టంగాచెప్పారు. ప్లాంట్ లో పోస్కో వాటా 50శాతముంటుందని, ఈ వ్యవహారానికి సంబంధించి పోస్కోవారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారని, అందుకు రాష్ట్రప్రభుత్వం కూడా అంగీకరించిందని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పారు. ఇంతజరిగినా విజయసాయి తనకపట నాటకాలు మానుకోలేదు. పోస్కోప్రతినిధులు తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలనుకూడా తాము విలేకరులకు చూపించాము. చీకటి ఒప్పం దాలు జరిగాక, పోస్కో కంపెనీ సీఈవోను సన్మానించారు కూడా. ఎంతోమంది త్యాగాలతో ఏర్పడిన విశాఖస్టీల్ ప్లాంట్ ను కాజేయడా నికి పూనుకోవడం సమంజసమేనా? సుమారు లక్షా52వేలకార్మికుల కుటుంబాల పొట్టగొట్టడం ప్రభుత్వానికి భావ్య మేనా అని ప్రశ్నిస్తున్నా. ఈ వ్యవహారానికి సంబంధించి వాస్తవా లు మాట్లాడాము. అక్టోబర్29, 2020న పోస్కోకంపెనీ సీఎండీ, ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారనేది వాస్తవమా కాదా? ఆసమావేశం ఎందుకుఏర్పాటుచేశారు. విశాఖస్టీల్ ప్లాంట్ ను అమ్మడానికి కాదా? నిజానిజాలేవో ముఖ్యమంత్రి జగన్, విజయసా యిరెడ్డే సమాధానం చెప్పాలి. ఆగస్ట్ 2020లో ఢిల్లీలో జరిగిన సమావేశానికి రాష్ట్రంనుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న రజత్ భార్గవ, సీఎస్ గాఉన్ననీలంసహానీ హాజరయ్యారు.

ఆ సమావేశాని కి వారుముఖ్యమంత్రికి తెలియకుండానేవెళ్లారా? చీకటి ఒప్పందా లుచేసుకొని, చేయాల్సిందంతాచేసి, నంగనాచిలా విజయసాయి రెడ్డి ముసలికన్నీరుకారుస్తూ, విశాఖపట్నంలో పాదయాత్రలు చేస్తున్నాడు. ఆయనకు, ఈముఖ్యమంత్రికి నిజంగా విశాఖస్టీల్ ప్లాంట్ నుకాపాడాలనే చిత్తశుద్ధిఉంటే, వారిపార్టీఎంపీలతో కలిసి ఢిల్లీలోపాదయాత్ర చేయాలి. ఇక్కడ పాదయాత్రలుచేయడం పబ్లిసిటీకోసమే. నిజంగా స్టీల్ ప్లాంట్ నుకాపాడేవారైతే మోదీని కలిసి, సమస్యగురించిచెప్పి, కేంద్రం మెడలువంచాలి. 20సార్లకు పైగా ఢిల్లీవెళ్లిన ముఖ్యమంత్రి విశాఖఉక్కుఫ్యాక్టరీకోసం ఏంసాధించా డు? విశాఖవచ్చికూడా దొంగస్వామీజీలను కలిసి, కార్మికుల వద్ద కురాకుండా పోతాడా ఈ ముఖ్యమంత్రి? కార్మికసంఘాలప్రతినిధు లను ఎయిర్ పోర్టుకు పిలిపించి, అక్కడ మాట్లాడమేంటి? ముఖ్య మంత్రి హోదాలో ఉన్న మూర్ఖుడు, ప్లాంట్ నుకాపాడకుండా, ప్లాంట్ పరిధిలోని 7వేలఎకరాలు అమ్మేస్తే సరిపోతుందని సలహాలిస్తాడా? ఇదేనా ముఖ్యమంత్రిగా ఉన్నవాడు చెప్పాల్సింది? ఇదేం పద్ధతో ఆయనే చెప్పాలి. ముఖ్యమంత్రికి నిజంగా స్టీల్ ప్లాంట్ ను కాపాడాలనే ఆలోచనేఉంటే, తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని తాముసూచించాము. అన్నిపార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి తాముసిద్ధమంటూ ఏకవాక్యంతో తీర్మా నం చేస్తాయని, ఆతీర్మానాన్ని తీసుకొని ఢిల్లీవెళ్లి పోరాడాలని కూడా తాముచెప్పడం జరిగింది. ఆపనిచేయడానికి కూడా ముఖ్యమంత్రి కి తీరికలేదా? రాష్ట్రఎంపీలను తీసుకొని ఢిల్లీ వెళ్లాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా? ప్రధాని ముందు గట్టిగా మాట్లడటానికి జగన్ కు భయమా....బొక్కలో వేస్తారని భయపడుతున్నాడా? ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ప్రధానమంత్రి విశాఖస్టీల్ ప్లాంట్ తో పాటు, భారతదేశంలోని కర్మాగారాలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేస్తున్నామని మొన్ననే చెప్పారు. కేంద్రప్రభుత్వమంటే వ్యాపారసంస్థకాదు, మా లక్షం సంక్షేమం, అభివృద్ధేనని చెప్పిన ప్రధాని ప్రైవేటైజేషన్ చేస్తాన నడం ఏమిటి? అదానీకో, మరొకరికో అన్నింటినీ అప్పగిస్తారా?

భారతదేశంలోని కర్మాగారాలనుఅమ్మేస్తారా? ఇదేమి పరిపాలన? ప్రధానమంత్రి వ్యాఖ్యలపై సమాధానంచెప్పాల్సిన బాధ్యత ముఖ్య మంత్రి జగన్ కులేదా? బీజేపీ నాయకలు ప్రధానివ్యాఖ్యలపై మాట్ల డరా? సోమువీర్రాజు గారుఢిల్లీ వెళ్లి కూడా ప్రధానిని ఎందుకు కలవ లేకపోయారు? అమిత్ షానుకలిస్తే, స్టీల్ ప్లాంట్ గురించి మీకెందుకు, మీరు వెళ్లండి అని బీజేపీవారితో అన్నారంట. అది నిజమోకాదో, బీజేపీవారే సమాధానంచెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో పోరాడి సాధించుకున్నది విశాఖ్ స్టీల్ ప్లాంట్. దొంగోడు వచ్చి విశాఖపట్నంలోమకాంవేసి, ఖాళీస్థలాలుఆక్రమిం చుకుంటుంటే, దేవాలయాలభూములను కాజేస్తుంటే, విశాఖ వాసులుచూస్తూ కూర్చుంటారా? మనప్రాంతాన్ని మనం కాపాడుకో వడానికి అందరంకలిసి దొంగలను తరిమికొట్టాలని కోరుతున్నా. విశాఖపట్నానికి ఏం తీసుకొచ్చారో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి. రైల్వేజోన్, ప్రత్యేకహోదా ఏమైంది. మున్సిపల్, కార్పొరేష న్ ఎన్నికల్లో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ల గూబగుయ్ మనేలా విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు సమాధానంచెప్పాలి. రెండేళ్లపాటు అమరావతినిసర్వనాశనంచేసిన వారికి ఎన్నికలురాగానే అక్కడ అభివృద్ధిచేయాలని గుర్తుకొచ్చింది. ఇంకెన్నాళ్లు చెబుతారు ఇలా దొంగమాటలు. శ్మశానమని, ఎడారని చెప్పిన మాటలు ప్రజలు మర్చిపోలేదు. విశాఖస్టీల్ ప్లాంట్ కోసం దీక్షలుచేస్తున్న కార్మికులు ఎవరూ కూడా దొంగోడు విజయసాయిరెడ్డి మాటలు నమ్మకండి. ఉత్తరాంధ్ర వైసీపీనేతలు, మంత్రులుకూడా విశాఖస్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రివద్దకు వెళ్లాలి. వారంతా ఆయన చేసేది తప్పని గట్టిగాచెప్పాలి. తుమ్మితే ఊడిపోయే పదవులకోసం ప్రజలను మోసగించకండి, రాష్ట్రసంపదను స్వాహ చేయకండి. సాక్ష్యాధారాలతోసహా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారాన్ని, జగన్ మోసాన్ని బయటపెట్టిన పట్టాభిగారికి ధన్యవాదాలు తెలుపుకుం టున్నాను. 5 వతేదీన జరిగే బంద్ లో టీడీపీతో పాటు, అన్నిపార్టీల వారు పాల్గొనితీరడమనేది ఆయాపార్టీలు, ప్రజలందరి బాధ్యత. బంద్ లోప్రజలంతా పాల్గొని విజయవంతంచేయాలని కోరుతున్నా.

Advertisements

Advertisements

Latest Articles

Most Read