ఆంద్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. టిడిపి నేత అయ్యన్నపాత్రుడు కేసులో హైకోర్టుఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్ట్ నిరాకరించింది. ఆంద్రప్రదేశ్ సీఐడీ పెట్టిన కేసులో అయ్యన్నకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అయ్యన్న భూ ఆక్రమణకు పాల్పడ్డారని సీఐడీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 10 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆంద్రహైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్ట్ ను ఏపి ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే ఇక్కడ కూడా ఏపి ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఫిబ్రవరి 3తేదికి సుప్రీంకోర్ట్ వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read