ఒక పక్క పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ అట్టర్ ఫ్లోప్ అయితే, హైదరాబాద్ లో చంద్రబాబు సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనల పై అనేక ఆంక్షలు పెడుతున్నారు. మొన్న చంద్రబాబ రోడ్ షో కు పర్మిషన్ ఇవ్వకపోవటం, చంద్రబాబు సభలకు తెరాస ప్రచార రధాలు పంపించి రెచ్చగొట్టటం లాంటి పనులు చేస్తున్న తెరాస ప్రభుత్వం, ఈ రోజు చంద్రబాబు, ఆజాద్ పాల్గున్న రోడ్ షో పై కూడా ఆంక్షలు పెట్టారు. ఆదివారం రాత్రి ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ సెంటర్‌‌లో చంద్రబాబు, గులాంనబీ ఆజాద్‌‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మొదట గులాంనబీ ఆజాద్ నియోజకవర్గ అభ్యర్థిని ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టగానే పోలీసులు వచ్చి వాహనాన్ని కదిలించాలని కోరారు.

azad 02122018 1

ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఇలా చేస్తున్నామని పోలీసులు ఇందుకు వివరణ కూడా ఇచ్చారు. దీంతో ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. పోలీసులు అడ్డుకోవడంతో కాసింత ఆగ్రహానికి లోనైన ఆజాద్ ఆగ్రహానికి లోనైన అనుమతిచ్చి మధ్యలో ఇలా చేయడం సబబు కాదని మండిపడ్డారు. పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని, విధి నిర్వహణ సక్రమంగా చేయాలని ఆజాద్ పోలీసులను సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ 40, 50 ఏళ్లుగా తాను హైదరాబాద్‌లో వివిధ సభలకి వచ్చినప్పటికీ ఇంత మంది యువకులు పాల్గొన్న బహిరంగ సభను చూడలేదని ఆజాద్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌, బీజేపీని ఓడించాలన్న చైతన్యం ఇక్కడి ప్రజల్లో వచ్చిందని ఈ సభల ద్వారా రూఢీ అవుతోందని ఆయన అన్నారు.

azad 02122018 1

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అటువైపు మోదీ ఇటువైపు జూనియర్ మోదీ మాటలతోనే కడుపు నింపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 37 సంవత్సరాలుగా బద్ధవిరోధులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడ ప్రజాస్వామ్యం కోసం ఒక్కటయ్యామని తెలిపారు. తెలంగాణకు ఎందుకు వచ్చారు? ఏం పని? అని తండ్రీ కొడుకులు అడుగుతున్నారని, అనవసరంగా తిడుతున్నారని తానే ఏం తప్పు చేశానని చంద్రబాబు ప్రశ్నించారు. ఔటర్ రింగురోడ్డు తేవడం తప్పా? ఐటీ కంపెనీలు తేవడం తప్పా? అని నిలదీశారు. కేసీఆర్ తన హయాంలో ఒక్క ఫాంహౌజ్‌ని నిర్మించుకున్నారు గానీ, ఒక్క పనైనా చేపట్టారా? అని బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ వారు పూర్తి చేశారని బాబు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read