Case Update : 2018 మార్చి నాటి వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణ కేసులో బీటెక్. లింగాల మహిళ కేసుతో బీటెక్ రవి అరెస్టుకు సంబంధం లేదు : కడప ఎస్పీ అన్బురాజన్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కొద్ది సేపటి క్రితం, చెన్నై లో, ఏపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీని పై వివరాలు తెలుసుకుని, తెలుగుదేశం నేతలు కూడా షాక్ అయ్యారు. కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం, నాగమ్మ అనే మహిళ మృ-తి కి నిరసనగా తెలుగుదేశం పార్టీ చలో పులివెందుల కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గునేందుకు, బీటెక్ రవితో పటు, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెలుగుదేశం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో పాటు, మొత్తం తెలుగుదేశం నాయకులు చాలా మంది పులివెందులకు వెళ్లారు. అయితే ఈ నేపధ్యంలో, ఓ మహిళ తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వీరందరి పై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు. అయితే ఆ కేసు ఆధారంగా, వీరి అందరినీ పట్టుకునే పనిలో పడిన పోలీసులు, బీటెక్ రవి నిన్న బెంగుళూరులో ఉన్నారని నిన్న అక్కడకు వెళ్ళగా, ఆయన చెన్నై వెళ్ళారని తెలుసుకుని, ఈ రోజు చెన్నై వెళ్లి మరీ ఆయన్ను అరెస్ట్ చేసారు. ఆయన కదలికల పై నిఘా పెట్టి, మరీ వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేసారు. ఈ రోజు ఆయన్ను కడప జిల్లా కోర్టుకు తరలించనున్నారు. బీటెక్ రవితో పాటుగా, మిగతా అందరి నాయకులుని కూడా అరెస్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ఈ రోజు, రేపటిలో అదుపులోకి తీసుకుంటారని తెలుస్తుంది.
అయితే ఈ సంఘటన పై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మహిళకు న్యాయం చేయాలని, చలో పులివెందుల నిర్వహిస్తే, ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతూ, అక్రమ కేసులను 20 మంది నేతల పై మోపారని లోకేష్ అన్నారు. పులివెందుల కార్యక్రమంలో పాల్గుని, మహిళను కాపాడమని వేడుకుంటే, టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తూ, దీని పై తాము న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. పోలీసులకు, జగన్ రెడ్డికి, తెలుగుదేశం నాయకుల పై అక్రమ కేసులు పై ఉన్న శ్రద్ధ, మహిళల రక్షణ పై లేకపోవటం బాధాకరం అని అన్నారు. అయితే దీని పై స్పందించిన తెలుగుదేశం పార్టీ లీగల్ టీంను అలెర్ట్ చేసింది. ఆయన్ను కోర్టులో హాజరు పరిచిన వెంటనే, బెయిల్ పిటీషన్ మూవ్ చేయాలనీ ఆదేశించింది. అయితే తెలుగుదేశం పార్టీ ఈ చర్య పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఒక ప్రజాప్రతినిధి పై అక్రమ కేసులు పెట్టి, అదేదో పెద్ద నేరం అయినట్టు, వేరే రాష్ట్రం వెళ్లి మరీ అరెస్ట్ చేయటం ఏమిటి అని, జగన్ కక్షసాధింపు పాలనకు ఇది ఒక ఉదాహరణ అని తెలుగుదేశం ఆరోపిస్తుంది.