రాజమండ్రి, ఆజాద్ చౌక్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారరు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్ రైజ్ స్టేట్ అని పేరు పెడితే సెటైర్లు వేస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరాన్ని కేసీఆర్ అడ్డుకుంటున్నారని చెప్పారు. ‘‘భద్రాచలం మునిగిపోతుందని అంటున్నారు..భద్రాచలం మాదే తిరిగి ఇచ్చేయండి. మైనార్టీలు కోడి కత్తి పార్టీకి ఓటు వేస్తే మోదీకి వేసినట్టే. ట్రిపుల్ తలాక్ పేరుతో కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశారు. అన్ని వ్యవస్థలను ప్రధాని మోదీ భ్రష్టు పట్టించారు. ప్రశ్నించినవారిపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి మోదీ సహకరించలేదు.
అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ వెలవెల పోతుందని కేసీఆర్ భయం. వైసీపీకి మద్దతు ఇవ్వాలని హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నవారిని కేసీఆర్ బెదిరిస్తున్నారు. హైదరాబాద్‌లో మాకు కూడా వ్యాపారాలు ఉన్నాయి..ఏం చేస్తాడో చూస్తా. కేసీఆర్ ఆంధ్రా వాళ్లను తిట్టారు..మనకు రోషం లేదా?. జగన్ అవినీతి వల్ల ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారు. జగన్‌కు పాలన అనుభవం లేదు.. జగన్ ఇచ్చే హామీలు నమ్మశక్యంగా ఉన్నాయా?.’’ అని చంద్రబాబు అన్నారు.