కడప జిల్లా బద్వేల్ లో ఉప ఎన్నిక నిన్న జరిగింది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే చనిపోవటంతో, ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అయితే చనిపోయిన వారి ఎన్నిక కావటం, అదే కుటుంబానికి చెందిన వ్యక్తికి వైసీపీ టికెట్ ఇవ్వటంతో, ఈ ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం టిడిపి దూరంగా ఉంది. తమ సిద్ధాంతం ప్రకారం, ఎన్నికల్లో ఎవరైనా చనిపోయి, అదే కుటుంబం వారికి టికెట్ ఇస్తే తాము ఆ ఎన్నికల్లో పోటీ పెట్టం అంటూ టిడిపి నిర్ణయం తీసుకుంది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో మాత్రం, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కాకుండా, జగన్ దగ్గర పని చేసే ఫిజియోకి టికెట్ ఇవ్వటంతో టిడిపి పోటీ పెట్టింది. ఈ సారి మాత్రం బద్వేల్ లో అదే కుటుంబం నుంచి టికెట్ ఇచ్చారు కాబట్టి పోటీ పెట్టలేదు. ఇక జనసేన కూడా, తాము కూడా ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాం అని ప్రకటించింది. అయితే బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పోటీ పెట్టటంతో, ఎన్నిక అనివార్యం అయ్యింది. నిన్న ఎన్నిక జరిగింది. సహజంగా టిడిపి ఎన్నికకు దూరంగా ఉండటం, తరువాత ప్రజాదరణ ఉన్న పార్టీ జనసేన కూడా దూరంగా ఉండటంతో, ఎన్నిక పై ఎవరూ ఇంట్రెస్ట్ చూపలేదు. బీజేపీకి ఎలాగూ ఒక శాతం కూడా ఓట్లు వచ్చే అవకాసం లేదు. కాంగ్రెస్ ది కూడా అదే తీరు. ఇంకేముందు వైసీపీ అత్యధిక మెజారిటీ వస్తుందని అందరికీ తెలిసిందే.

badwel 31102021 2

అయితే అనూహ్యంగా నిన్న కూడా వైసిపీ, తిరుపతి సీన్ రిపీట్ చేసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో, దొంగ ఓట్ల జాతార అందరూ చూసారు. వందల వందల బస్సులు వేసుకుని వచ్చి మరీ, తిరుపతిలో దొంగ ఓట్లు గుద్దుకున్నారు. అయితే అసలు పోటీనే లేని బద్వేల్ లో కూడా, ఇదే సీన్ రిపీట్ అవ్వటంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. చాలా చోట్ల దొంగ ఓటర్లను పట్టుకున్నారు. ఒక చోట వందల సంఖ్యలో ఉన్న వారిని కూడా బీజేపీ, కాంగ్రెస్ నేతలు, మీడియా పట్టుకుంది. అయినా అధికారులు మాత్రం, ఎన్నిక సజావుగా జరిగిందని ప్రకటించారు. అయితే ఆఖరకు ఇక్కడ కూడా ఎందుకు దొంగ ఓట్ల జాతర చేసారు అనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని గమనించారా ? అందుకే ముందుగానే ఇలా ప్లాన్ చేసారా అనే చర్చ జరుగుతుంది. మెజారిటీ తగ్గితే తమ పని అయిపొయిందని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి, ఇలా ఇక్కడ కూడా దొంగ ఓట్ల జాతర చేసి ఉంటారని, ప్రచారం జరుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ ఏమి చేయలేని స్థితిలో ఉంటూ, వారు కూడా ఈ దొంగ ఓట్లకు బలి అయ్యారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read