వైఎస్ వివేకా హత్య కేసులో, అవినాష్ రెడ్డి పాత్ర గురించి, సిబిఐ ఎన్ని ఆధారాలు ఇచ్చినా, గూగుల్ టేక్ అవుట్ తో చెప్పినా, ఫోన్ కాల్స్ వివరాలతో కోర్టు ముందు పెట్టినా, అవేమీ నిలబడలేదు. తెలంగాణా హైకోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించ లేదు. అవినాష్ రెడ్డి రక్తం మరకలు తుడిపించాడని, అలాగే చంపించిన వారు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని, ఆ రోజు రాత్రి అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ చేసారని, ఇలా మొత్తం ఆధారాలు సిబిఐ కోర్టు ముందు పెట్టింది. అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తే, సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పింది. అలాగే అవినాష్ రెడ్డి విచారణలో సహకారం అందించటం లేదని కూడా చెప్పింది. అరెస్ట్ చేయటానికి వెళ్తే, కర్నూల్ హాస్పిటల్ ముందు ఆడిన డ్రామా వివరించింది. అయితే ఇవేమీ హైకోర్టు విశ్వసించినట్టు కనిపించ లేదు. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ, హైకోర్టు భారీ ఊరట ఇచ్చింది. అవినాష్ రెడ్డికి హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం విచారణకు రావాలని ఆదేశించింది. ఈ వాదనల సమయంలో హైకోర్టు అడిగిన ప్రశ్నలు, సిబిఐ సరిగ్గా సమాధానాలు చెప్పలేక పోయింది. అప్పుడే హైకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తుందని, న్యాయ నిపుణులు ఊహించారు. అందరూ అనుకున్నట్టే బెయిల్ వచ్చింది. మరి సిబిఐ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేస్తుందా, లేదా అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచి వదిలేస్తుందా అనేది చూడాలి. సిబిఐ వెళ్లకపోయినా, సునీత మాత్రం, సుప్రీం కోర్ట్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read