అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌ నియామకం కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు ధర్మవరం నియోజకవర్గానికి గోనుగుంట్ల సూర్యనారాయణ పెద్ద దిక్కుగా ఉన్నారు. గత రెండు ఎన్నికల నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2014లో గెలిచారు, 2019లో ఓడిపోయారు. అయితే ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఆయన పార్టీ మారిన పరిస్థితుల్లో ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జ్ కోసం తెలుగుదేశం పరత్రి కసరత్తు చేస్తుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచన మేరకు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ బాధ్యత తీసుకున్నట్టు సమాచారం. దీంతో బాలయ్య రంగంలోకి దిగారు. ఎవరైతే పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిలబదటారో, అలాంటి వారి కోసం పార్టీ చూస్తుంది. నియోజకవర్గంలో, స్థానికంగా ఉండే నాయకులు, కార్యకర్తలతో బాలక్రిష్ణ మాట్లటి వారి అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం. వైసీపీ నేతలు దాడులు చేస్తున్న పరిస్థితుల్లో, ధర్మవరంలో పార్టీకి నిలబడే వరి కోసం పార్టీ అన్వేషిస్తుంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు దివంగత పరిటాల రవీంద్ర కుటుంబానికే ఇవ్వనున్నట్టు సమాచారం. పరిటాల కుటుంబానికి, జిల్లాలోని పెనుకొండ, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. ఈ పరిస్థితుల్లో ధర్మవరం నియోజకవర్గంలో నాయకత్వ సమస్య ఉండడంతో పరిటాల కుటుంబం నుంచి ఒకరికి ఆ బాధ్యతలు అప్పచెబితే బాగుటుంది అనే అభిప్రాయలు వ్యక్తం అయినట్టు సమాచారం. ఈనెల 8న ధర్మవరంకు మాజీ సీఎం చంద్రబాబు వస్తున్న నేపధ్యంలో ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పై ఒక క్లారిటీ వచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నియామకం పై చంద్రబాబు నిర్ణయాన్ని అమలు చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read