తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో శనివారం రాత్రి తెదేపా అభ్యర్థి కూన వెంకటేష్‌గౌడ్‌తో కలిసి బాలకృష్ణ రోడ్‌షో నిర్వహించారు. స్వామి కాంప్లెక్స్‌ వద్ద, మహంకాళి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో చంద్రబాబునాయుడి పేరు వినిపించకుండా చేయాలంటున్నారు, ఆయన చేసింది ఏమి లేదు అంటున్నారు. అలా అయితే చంద్రబాబు కట్టించిన శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలని, హైటెక్ సిటీని కూల్చి వేయాలని, ఫ్లయ్ ఓవర్లను తొలగించాలని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ పనులు చేసే దమ్ముందా? అంటూ కేసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలించేది భల్లాలదేవుడే అయినా ప్రజలు గుర్తు పెట్టుకునేది మాత్రం బాహుబలినే అని సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబును దూషించే వారివి గల్లీ బుద్ధులని విమర్శించారు.

balayya 02122018 2

తెలుగు తెర వీడి ప్రజల కోసం తెదేపాను స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెదేపా.. నాయకుల కోసం, ధనవంతుల కోసం పుట్టిన పార్టీ కాదని; భూస్వాములు, పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ అని తెలిపారు. మహిళలతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి ఆనాడు తెదేపా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఆ పథకాలనే ఇప్పటి పార్టీలు కాపీ కొట్టక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్ని సుడిగుండాలు ఎదురైనా తెదేపా జెండా రెపరెపలాడుతూనే ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ నెలకొల్పిన ఘనత చంద్రబాబుది మాత్రమేనన్నారు. చంద్రబాబును హైదరాబాద్‌ చరిత్ర పుటల నుంచి తొలగించాలంటే హైటెక్‌ సిటీని, ఔటర్‌ రింగ్‌ రోడ్డును మాయం చేయాలని అలా చేసే దమ్ము ఎవరికుందని ప్రశ్నించారు.

balayya 02122018 3

చంద్రబాబు కట్టిన కట్టడాల్లో మీటింగ్‌లు పెట్టుకుంటూ చంద్రబాబునే విస్మరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌కు దీటుగా సైబరదాబాద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. మూడొస్తే ఫామ్ హౌస్ లో పడుకునే వాడు కాదు చంద్రబాబు .. మూడొస్తే స్టేట్ కోసం నలుదిశలా తిరిగే వాడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు ని అవుట్ చేయాలనుకుంటే మీ అంత out-and-out కమెడియన్స్ ఉండరు, అమెరికా అధ్యక్షుడి బిడ్డని తీసుకొచ్చి మీ బిల్డప్పులు ఏందీ భాయ్ నాకు అర్ధం కాలేదు.. 15 ఏళ్ళ ముందటే వాళ్ళ బాబులని ఇక్కడ గుట్టల్లో నడిపించాడు చంద్రబాబు అని బాలయ్య అన్నారు. Laptop కనిపెట్టింది కూడా చంద్రబాబే అని కుళ్ళు సెటైరులు వేస్తున్నారు.. అమెరికా అధ్యక్షుడి కూతుర్ని తీసుకువచ్చి పులి వేషాలు వేశారు ....15 ఏళ్ళ ముందటే వాళ్ళ బాబులని పట్టుకువచ్చాడు అని కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ జెండా.. ఎగరాలి తెలంగాణ నిండా’ అంటూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. తెలంగాణలో గడీల పాలనను తమ పార్టీనే అంతం చేసిందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read