తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు ఒక్కొక్కరూ ముందుకొస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉదారంగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ బాధితులకు బాసటగా నిలిచారు. బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన రూ.25లక్షల విరాళాన్ని ప్రకటించారు. తుపాను తీవ్రతతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కొంత మంది ముందుకొచ్చారు.

nbk 17102018 2

ఇప్పటికే కార్తీకేయ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించడం విశేషం. తితలీ తుపాను ధాటికి అతలాకుతలమైన ఉత్తరాంధ్ర వాసులకు అండగా, సాయం చేసేందుకు తాము సైతం అంటూ తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం కూడా విరాళం ప్రకటించింది. ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శశిభూషణ్‌ తెలిపారు. ఇప్పటికే సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారులు శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు.

nbk 17102018 3

మరో పక్క, తిత్లీ తుఫాన్ బాధితుల‌కు మంత్రి కళావెంకటరావు ఆద్వర్యంలో త‌మ వంతు సాయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోటి రూపాయల చెక్కును అందించిన విశాఖ డైరీ యాజమాన్యం. ఇది ఇలా ఉంటే, తిత్లీ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. నష్టం అంచనా వేయడానికి, బాధాతప్త హృదయాల్లో భరోసా కల్పించి ఆదుకోవడానికి ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తోందని చెప్పారు. విరాళాలు ఇచ్చేవారు ముఖ్యమంత్రి సహాయనిధికి పంపాలని లోకేశ్‌ కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read