రాజకీయాల కోసం, కుటుంబాల్లో కూడా చిచ్చు పెట్టటం, మన రాష్ట్రంలో మొదటి నుంచి చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నందమూరి కుటుంబం నుంచి, చంద్రబాబుని వేరు చేయటానికి, గత 30 ఏళ్ళ నుంచి రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి, ఎన్నో ప్రయత్నాలు చేసారు. కొన్నిట్లో సక్సెస్ అయ్యారు కూడా. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్, అలాగే బాలయ్య విషయంలో కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి జిమ్మిక్కులే పన్నుతూ వస్తుంది. ఇప్పటి వరకు అయితే వీరి వేషాలను, ఇద్దరూ కూడా తెలివిగా తప్పిస్తూ వస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ పేరుని, కృష్ణా జిల్లాకు పెట్టిన విషయం పైన, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని, జగన్ కు ధన్యవాదాలు చెప్పాలి అంటూ, వైసీపీ పెద్ద క్యాంపెయిన్ నడిపింది. ఎవరు స్పందించినా, వారిని చూపించి, చంద్రబాబుని , నందమూరి అభిమానులకు దూరం చేయాలని, ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకి ఇష్టం లేదు అనే సీన్ చేయాలని అనుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ బయటకు రారు కాబట్టి ఆయనకు ఇబ్బంది లేదు, ఆయన తప్పించుకున్నారు. బాలయ్య మాత్రం ఎమ్మెల్యే కాబట్టి ప్రజల్లో తిరుగుతారు. ఆయనను ఎలాగైనా ఈ విషయం పై స్పందించే విధంగా, వైసీపీ ట్రాప్ వేసింది. తమ అనుకూల మీడియాను వాడుకుంది.
బాలయ్య హిందూపురం జిల్లా కోసం, నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో, బాలయ్య విలేఖరులతో మాట్లాడిన సమయంలో, ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా, మీకు సంతోషమేనా అని బాలయ్యని విలేఖరులు అడిగారు. దీనికి బాలయ్య స్పందించారు. ఎన్టీఆర్ గారి మీద వీళ్ళకు ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ హడావిడి చేస్తున్నారని, అసలు వీళ్ళకు నిజంగా ఇంత ప్రేమ ఉందా అంటూ ప్రశ్నించారు. అంత ప్రేమే ఉంటే, ప్రతి ఊరిలో ఎన్టీఆర్ విగ్రహాలు పగలగొడుతున్నారని, అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారని అన్నారు. ఒక్కరి పైన అయినా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. పేదలకు పెట్టే అన్న క్యాంటీన్లకు, ఎన్టీఆర్ పేరు ఉందని, ఎత్తేసిన వీళ్ళా మాట్లాడేది, పధకాలకు ఎన్టీఆర్ పేరు ఉంటే మార్చేసిన వీరా మాట్లాడేది అంటూ, బాలయ్య ఎదురు ప్రశ్నించారు. దీంతో బాలయ్య తెలివిగా సమాధానం చెప్పటంతో, వైసీపీ అనుకున్నది జరగలేదు. బాలయ్య ధన్యవాదాలు చెప్తే, అది సాకుగా చూపి, చంద్రబాబు మీద రాజకీయంగా పై చేయి సాధించ వచ్చు అనే ప్లాన్ వర్క్ అవుట్ అవ్వలేదు.