ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇలా కూడా ఉంటారా అనే విధంగా, కొడాలి నాని మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు పేరు చెప్తే, ఈయనకు పూనకం వచ్చేసి, ఉచ్చం, నీచం కూడా తెలియదు. చంద్రబాబు అనే కాదు, తన పై ఎవరు విమర్శలు చేసినా బూతులతో సమాధానం చెప్తున్నారు. నీ అమ్మ మొగుడు, బొచ్చు పీకుతావా, అనేవి ఈయన నోట్లో నుంచి వచ్చే ఊత పదాలు. చివరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై కూడా ఇదే భాష మాట్లాడుతూ ఉంటారు. చివరకు పేకాటలో తన అనుచురులు దొరికినా, ఏమవుతుంది ఉరి వేస్తారా, ఫైన్ కడతారు, మళ్ళీ వచ్చి ఆడుకుంటారు అంటూ చాలా సింపుల్ గా తీసి పడేసే వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్ళింది అంటే, అతన్ని ఒక మనిషిలా కూడా లెక్క వేయకూడదు అని తెలుగుదేశం అనుకునే దాకా వెళ్ళింది. అందుకే మీడియా ముందు బూతులు తిట్టి అలసి పోయి వెళ్ళిపోతారు కొడాలి నాని. కానీ కేఏ పాల్ లాగే, కొడాలి నాని వ్యాఖ్యలను తెలుగుదేశం పట్టించుకోవటం ఆపేసింది. అయితే, ఈ రోజు హిందూపురంలో పర్యటన చేసిన ఎమ్మెల్యే నందమారి బాలకృష్ణ, మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని పై సంచలన వ్యాఖ్యలు చేసారు. సహజంగా బాలయ్య ఇలాంటి వారికి స్పందించరు. ఇలాంటి వారిని పట్టించుకోరు కూడా. అయితే కొడాలి నాని శ్రుతిమించితున్నారు అనుకున్నారో ఏమో, బాలయ్య మీడియా ముందు కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు.

balayya 06012021 2

బాలయ్య మాట్లాడుతూ "ఒక న్యాయం అంటే, చట్టం అంటే వీరికి లెక్క లేదు. ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. మొన్న ఎవడో ఒకడి తమ్ముడు, వాడు పేకాటలో పట్టుబడ్డాడు. ఏంటి రా నీ తమ్ముడు దొరికాడు గా అంటే, ఆ ఏముంది కోర్టులో వేస్తారు, ఫైన్ కడతాం, బయటకు వస్తాడు, మళ్ళీ పేకాడతాడు అనే విధంగా స్పందిస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకో. వాడికి చెప్తున్నాను. మా సహనాన్ని పరీక్షించవద్దు. మేము మాటల మనుషులం కాదు, ఊరికినే నోరు పారేసుకోవటానికి. అవసరం అయితే చేతల్లో కూడా చూపిస్తాం. జాగ్రత్త, తస్మాత్" అంటూ హెచ్చరించారు. ఇక అలాగే ఇక్కడ రకరకాల మంత్రులు ఉన్నారని, ఒకరు బెంజ్ మినిస్టర్, ఒకరు హవాలా మినిస్టర్, ఒకరు బూతులు మినిస్టర్, ఒకరు పేకాట మినిస్టర్, ఒకరు ఇసుక మంత్రి, ఒకరు లిక్కర్ మంత్రి, ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు అంటూ, బాలయ్య తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అలాగే తన పర్యటనలో దెబ్బతిన్న పంటలను చూసారు. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదని, ఇన్సురన్సు ప్రీమియం కట్టలేదని, విపత్తు సహాయం లేదని ధ్వజమెత్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read