Sidebar

14
Fri, Mar

ఇద్దరు టాప్ హీరోలు ఒక చోట కలిస్తే ? ఇద్దరు టాప్ నేతలు ఒక చోట కలిస్తే ? తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యే వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని కలిసారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ టాప్ హీరోలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. బాలకృష్ణ నటిస్తున్న వీరసింహా రెడ్డి సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు బాలయ్య షూటింగ్ చేస్తున్న వీరసింహా రెడ్డి సెట్ కు, పవన్ కళ్యాణ్ వచ్చి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ భేటీ ఎందుకు జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక పోతే ఇప్పటికే అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ షూటింగ్ కూడా ఈ వారమే జరుగుతుందని చెప్తున్నారు. సంక్రాంతికి ఈ ఎపిసోడ్ వస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఇద్దరు టాప్ హీరోలు ఒక్క చోట చేరితే, దబిడి దిబిడే మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read