బాలయ్య అక్కినేనిని అగౌరవపరిచారంటూ సాగుతున్న కాంట్రవర్సీ పూర్తిగా బులుగు బ్యాచ్ సృష్టి అని స్పష్టమైంది. అక్కినేనిని తొక్కినేని అన్నారనుకుందాం. అక్కినేని కుటుంబం స్పందించాలి. కానీ విచిత్రంగా కాపునాడు నేతలు సీనులోకి వచ్చారు. బులుగు బ్యాచ్ సృష్టించిన ఈ కాంట్రవర్శీని చూస్తుంటే నువ్వునేను సినిమాలో కామెడీ సీను గుర్తొస్తుంది. సునీల్ ని క్లాసురూములో ఓ అమ్మాయి మూసుక్కూర్చోరా పూలచొక్కా అంటుంది. సునీల్ బెంచ్ పైకి ఎక్కి ఇక్కడెవరో నన్ను పూలచొక్కా మూసుక్కూర్చోరా అన్నారు. లెక్చరర్ వచ్చి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తాడు. సేమ్ ఇదే సీన్ క్రియేట్ చేసిబులుగు బ్యాచ్ నవ్వుల పాలవుతోంది. మామూలు సంభాషణలో ప్రాస కోసం ప్రయత్నించిన బాలయ్య ఆ రంగారావు అక్కినేని, తొక్కినేని గురించి మాట్లాడుకున్నామనే సంభాషణలో ఎవ్వరికీ ఏ తప్పూ కనపడటంలేదు. ఒకవేళ అక్కినేని కుటుంబం నాగేశ్వరరావుని అక్కినేని గారు అనలేదని, ఆయన పేరు తరువాత తొక్కినేని ఎవరంటూ ప్రశ్నించినా అర్థం ఉంది. అసలు సంబంధమేలేని కాపునాడు పేరుతో బులుగు బ్యాచ్ చేసిన కన్నింగ్ పాలిటిక్స్ నవ్వులపాలయ్యాయి. బాలయ్య రంగారావు అన్నందుకు లోకేష్ పాదయాత్ర ఆపేయాలట. ఇంకా నయం..బాలయ్యకి పిల్లనిచ్చిన ఎస్ఆర్ఎంటీ వాహనాలు ఆపేయాలని డిమాండ్ చేయలేదు.
వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపిన కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే బాబాయ్ ని చంపింది అబ్బాయ్‌లేనని ఇన్నాళ్లు వస్తున్న వార్తలు వాస్తవమేనని స్పష్టమైపోతుంది. ఈ నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్కి మారుపేరయిన బులుగు బ్యాచ్ క్యాంప్ అక్కినేని..గిక్కినేని వ్యవహారాన్ని బయటకు తెచ్చింది. వాస్తవంగా బాలయ్య ఓ రైటర్ గురించి చెబుతూ ``ఎప్పుడూ శాస్త్రాలు, డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని గురించి తొక్కినేని గురించి మాట్లాడుకుంటాం`` అని అన్నారు. ఇందులో తప్పేముంది. డబ్బూ గిబ్బూ, నేరం గీరం, అంటూ మాట్లాడేటప్పుడు ప్రాసలు వాడుతాం అదే విధంగా అక్కినేని గిక్కినేని అన్నారు. ఆ రంగారావు గారు అన్నారు. ఇందులో ఎవరిని ఏం అసభ్యంగా మాట్లాడారని...నిన్నటి నుంచీ బులుగు బ్యాచ్ పెయిడ్ మేథావులు, తెలుగు-సంస్కృతాన్ని పేకాట ఆడేపే పతివ్రతలు మీడియా ముందుకి వచ్చి ఒకటే రోదిస్తున్నారు. ఈ వివాదాన్ని చూశాక, బాలయ్య నోట తప్పు మాట రాకుండా వివాదం ఎలా అని చూస్తే...ఇదంతా వైసీపీ శకుని వ్యూహాల్లోంచి సృష్టించిన కాంట్రవర్సీ అని తేలిపోయింది.