భార్య వసుంధర, సోదరుడు రామకృష్ణ, సోదరి లోకేశ్వరి, ఉమామహేశ్వరి, హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నందమూరి బాలకృష్ణ మీడియా సమావేశం. పెట్టారు. ఆయన మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో జరిగిన విషయం చూసాం, ఊరుకే చేతులు కట్టుకుని కూర్చోలేదు ఇక్కడ. మా ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు. అసెంబ్లీ పరిణామాలు బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదు. ప్రజాసమస్యలపై పోరాడటమే అసెంబ్లీ వేదికగా ఉండేది. ఇక నుంచి ఎవడైనా వాగినా, మీరు మీ వ్యవస్థలు ఎన్ని అడ్డు పెట్టుకున్నా, అవేమి మమ్మల్ని ఆపలేవ్, జాగ్రత్త. మా చెల్లెలు, ఏనాడైనా రాజకీయాల గురించి మాట్లాడిందా ? మీ వేషం, మీ భాష, మీ ఆహార్యం చూస్తే, గొడ్ల చావిట్లోకి వచ్చినట్టు ఉంది. మీ బాబాయ్ కేసులో, మీ మీద అనుమానం ఉందని, మీ కుటుంబ సభ్యులే చెప్పారు. అక్కడ ఇష్యూ ఉంది. అది లేవనెత్తితే, దాన్ని డైవర్ట్ చేస్తారా ? అవేమి మాటలు ? అసెంబ్లీలోనే అనేక మంది ఉన్నారు, మంచిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి భాష మాట్లాడుతున్నందుకు వారికి కూడా ఇబ్బంది ఉంటుంది, కానీ బయటకు చెప్పుకోలేక పోతున్నారు."
"మా పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగినా, ఎన్ని బూతులు తిట్టించినా, ఆయన ఎప్పుడూ చలించలేదు. మేము అప్పుడే ఊరుకోలేదు, కానీ చంద్రబాబు గారు వారించారు. కానీ ఇప్పుడు ఇది చుసిన తరువాత, ఇక మేము ఉపేక్షించం. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. ఏది శాస్వతం కాదు అనే విషయం గుర్తు పెట్టుకోండి. రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసారో చూస్తున్నాం. మొత్తం నాశనం చేసి పెట్టారు. గతంలో చంద్రబాబు గారు ఎలా హ్సుసారు, ఇప్పుడేమి చేస్తున్నారు ? జాగ్రత్తగా ఉండండి, నోరు జారీతే తాట తీస్తాం. ఇక నుంచి చంద్రబాబు గారి మాట కూడా మేము వినం. ఆయన అనుమతి కూడా అవసరం లేదు. ఇక నుంచి ఆయన ఆపారు కాబట్టి ఆగాం. ఆయన ఇచ్చే విలువతోనే, మీరు ఏమి చేసినా సాగింది. ఇక నుంచి కుదరదు. ఇదే మా హెచ్చరిక. పార్టీ కార్యకర్తల తరుపున, కుటుంబం తరుపున, మా సినిమా ఫాన్స్ తరుపున, అందరి తరుపునా హెచ్చరిక. మరోసారి ఇది రిపీట్ అయితే, ఇక చూస్తూ ఉండం. ఇక నుంచి జాగ్రత్తగా, అలోచించి మాట్లాడండి."