చంద్రబాబు స్ట్రాటజీ మార్చారు. జగన్ మోహన్ రెడ్డి పై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించటానికి సిద్ధం అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా, జగన్ మోహన్ రెడ్డి పై, హిందూపురం ఎమ్మల్యే నందమూరి బాలకృష్ణను చంద్రబాబు రంగంలోకి దించుతున్నారు. ఇంతకీ చంద్రబాబు ప్రయోగించే అస్త్రం ఏమిటి ? ఏ విషయంలో బాలయ్యను చంద్రబాబు రాగంలోకి దించుతున్నారు ? అనే ప్రశ్నలకు సమాధానం, తెలుగు మీడియం బోధన ఎత్తి వేయటం. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియం ఎత్తేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండేలా, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇంగ్లీష్ మీడియం ఉండటం తప్పు కాదని, కాని తెలుగు మీడియం ఎత్తేయటం మాత్రం, మంచిది కాదని, ఆప్షన్ అనేది పిల్లలకు ఇవ్వాలని, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ గతి ఏంటి అంటూ ఆందోళన చేస్తున్నాయి.
అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేస్తూ, ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ప్రతిపక్షాల విమర్శల పై, అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పటానికి, జగన్ మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. డిసెంబర్ 9 నుంచి, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అక్కడే ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ గా చంద్రబాబు మరో స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారు. తెలుగు మీడియం విషయంలో, జగన్ మోహన్ రెడ్డి పై, నందమూరి బాలకృష్ణ చేత సమాధానం చెప్పించటానికి చంద్రబాబు రెడీ అయ్యారు. తెలుగు మీడియం విషయంలో, తెలుగు భాష పై పూర్తీ పట్టు ఉన్న బాలయ్య చేత సమాధానం చెప్పించటానికి చంద్రబాబు రెడీ అయ్యారు.
తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, అలాగే తెలుగు మీడియం చదువులు కూడా అవసరం అని, ఎవరికి కావాల్సింది వారు ఎంపిక చేసుకునే స్వేఛ్చ ఇవ్వాలని తెలుగుదేశం వాదిస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే విషయం గట్టిగా చెప్పాలని, దీనికి తెలుగు భాష, పద్యాలు పై పట్టు ఉన్న బాలకృష్ణ అయితే, సరైన విధంగా చెప్పాలి అనుకున్నది చెప్పొచ్చు అని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పార్లమెంటులో అప్పటి రాజ్యసభ టీడీపీ ఎంపీ హరికృష్ణ అచ్చతెలుగులో మాట్లాడి తెలుగువారి ఔన్నత్యాన్ని, తెలుగు భాష గౌరవాన్ని చాటి చెప్పారని, ఇప్పుడు బాలకృష్ణ కూడా ఇదే విధంగా తెలుగు భాష గొప్పదనాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పి, జగన్ మోహన్ రెడ్డిని డిఫెన్సు లోకి నెట్టాలని, చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఈ విషయం పై, జగన్ మోహన్ రెడ్డి, ఎలా స్పందిస్తారో చూద్దాం.