ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఉంది. గత మూడు, నాలుగు రోజులుగా, రాష్ట్రంలో విపరీతమైన కరెంట్ కోతలు ఉన్నాయి. చెప్పా పెట్టకుండా తీస్తున్న కరెంట్ కోతలతో, ప్రజలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. మరో పక్క రాత్రి పూట కరెంట్ కోతలతో, దోమలతో ఇబ్బంది పడుతూ, ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సంక్షోభం పై, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అదిరిపోయే కారణం చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం, చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే, నేడు కరెంటు సంక్షోభం ఏర్పడిందని మంత్రిగారు చెప్పారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా, ఇంకా చంద్రబాబే కారణం అంటూ చెప్పుకొస్తున్నారు. నిజానికి చంద్రబాబు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న సందర్భం ఉంది. విద్యుత్ రంగంలో, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్టేట్ గా నిలవటానికి, కారణం చంద్రబాబు.

balineni 30092019 2

గత 5 ఏళ్ళలో, 24/7 కరెంటుతో , ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసారు చంద్రబాబు. అయితే జగన్ ప్రభుత్వం రాగానే, కరెంటు కోతలు మొదలయ్యాయి. మధ్యలో ఒక నెల రోజులు కరెంట్ కోతలు తప్పాయి. అది కూడా, వర్షాలు పడటంతో, వాడకం తగ్గటం వల్ల. అయితే ఇప్పుడు వర్షాలు తగ్గటంతోనే, కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. దీనికి కారణం చంద్రబాబు అని సింపుల్ గా చెప్పేసింది, వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అవసరం అయ్యే విద్యుత్ విషయంలో, సరిగ్గా పని చెయ్యకుండా, ఈ రాజకీయాలు ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. సహజంగా, వానా కాలంలో, కరెంటు కోతలు అనేవి ఉండవు. కాని మన ప్రభుత్వం బొగ్గు కొరత ఉందని చెప్పుకోస్తూ వివరణ ఇచ్చింది. వర్షాలు పడటం వల్ల, బొగ్గు కొరత ఉందని చెప్తుంది.

balineni 30092019 3

ఏపీలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు రోజుకు 75వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా, ప్రస్తుతం 45వేల మెట్రిక్ టన్నులు మాత్రమేవస్తోంది. మరి ఇంత తక్కువ బొగ్గు వస్తునప్పుడు, ప్రభుత్వం ఏమి చేస్తుంది ? అధికారులు ఏమి చేస్తున్నారు. అంచనా వెయ్యలేక పోయారా ? కొరత ఏర్పడి, విద్యుత్ కోతలు విధించే దాకా, బొగ్గు లేదని ప్రభుత్వానికి తెలియదా ? ఇక మరో అంశం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, లెటర్‌ ఆఫ్ క్రెడిట్. ఏ రాష్ట్రమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ముందుగానే లెటర్‌ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలి. అయితే మన ప్రభుత్వం అది ఇవ్వని కారణంగా, ఎక్స్చేంజి లో, మనల్ని నిషేధించారు. మరో పక్క, సోలార్, విండ్ ఎనర్జీ తీసుకోకుండా, వాళ్ళని కోర్ట్ లు చుట్టూ తిప్పుతున్నారు. ఇన్ని కారణాలు పెట్టుకుని, సింపుల్ గా, చంద్రబాబు పాపాల వల్లే ఈ కష్టాలు అని మంత్రిగారు తేల్చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read