ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇదేదో విభజన హామీలకు సంబందించో, లేక నీటి పంపకాల విషయంలోనో, లేక ఒక రాష్ట్రం వల్ల ఇంకో రాష్ట్రం ఇబ్బంది పడుతుందనో కాదు. బీజేపీ విషయంలో మీరు వంత పడుతున్నారు అంటే, మీరు అంటూ, ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. దేశంలోనే మొదటి సారిగా, కేంద్రం కొత్తగా పెట్టిన షరతులకు తలొగ్గి, ఎక్కువ అప్పు పడుతుంది అనే ఉద్దేశంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులు వాడుతున్న కరెంటు మోటార్లకు మీటర్లు బిగుంపు చేపట్టింది. రైతులు వాడే కరెంటుకు మీటర్లు పెడితే అదనపు అప్పు ఇస్తాం అని కేంద్రం షరతు పెట్టింది. ఇదేదో ప్రోత్సాహకం కూడా కాదు, అదనపు అప్పు మాత్రమే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ షరతుకు తలొగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మీటర్లు బిగింపు కోసం రాష్ట్ర ఖజానా పై దాదపుగా 750 కోట్ల భారం కూడా పడనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతుల పై ఒక్క పైసా భారం కూడా వెయ్యం అని , ఎప్పటి లాగా ఉచిత విద్యుత్ ఇస్తాం అని, రైతులు ఎంత వాడితే అంత నగదు బదిలీ చేస్తాం అని చెప్తుంది.

అయితే ఈ విషయం పై అనేక సందేహాలు రైతుల్లో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే, మూడు రోజుల క్రితం తెలంగాణా మంత్రి హరీష్ రావు, జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్రం పెట్టే షరతులకు తలొగ్గి, అదనపు అప్పు కోసం, జగన్ మోహన్ రెడ్డి రైతుల మెడలకు ఉచ్చి బిగిస్తున్నారని, కేసీఆర్ మాత్రం, నీ డబ్బులు వద్దు, నీ మీటర్లు వద్దు అని రైతుల పక్షాణ నిలబడ్డారని, వ్యాఖ్యలు చేసారు. అయితే దీని పై మూడు రోజుల తరువాత, రాజకీయ పరంగా లెక్కలు అన్నీ వేసుకుని, ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని స్పందించారు. కేంద్రం ఇచ్చే డబ్బులు తమ జేబుల్లో ఏమి వేసుకోం అని, అవి కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తామని చెప్పారు. రైతుల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చెయ్యం అని అన్నారు. అయితే టీఆర్ఎస్ లాగా, బీజేపీతో మంచిగా ఉంటూ , ఒక రోజు మంచిగా, మరో రోజు గొడవ పడి ఇష్టం వచ్చినట్టు చెయ్యం అని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటామని, హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read