మొన్న కెసిఆర్ మాటలు గుర్తుండే ఉంటాయి. "అసలు తెలుగుదేశం అనేది ఒక పార్టీనా రా అయ్యా ? దానికి తెలంగాణాలో 0.0001 % ఓటింగ్ కూడా లేదు. అలాంటి పార్టీ గురించి మేము పట్టించుకుంటామా. అలాంటి ఓటింగ్ ఉన్న చంద్రబాబు ఒక నాయకుడా ? మాకు ఇలాంటి వాళ్ళతో అసలు పంచాయతీనే లేదు. అసలు అది ఒక పార్టీనే కాదు" అంటూ కెసిఆర్ చెప్పారు. మరి ఆయన సోయలో ఉండి చెప్పాడో, బ్యాలెన్స్ తప్పి చెప్పాడో కాని, తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణాలో లేదంటూ హేళనగా మాట్లాడారు. అయితే, కెసిఆర్ ద్రుష్టిలో 0.0001 % ఓటింగ్ ఉన్న తెలుగుదేశం పార్టీ పై, ఈ రోజు కెసిఆర్ భజన బృందం వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టింది.

balka 15092018 2

చంద్రబాబుని టార్గెట్ చేసుకుని, దాదాపు 10 మంది తెరాస నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. పాపం ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ అనుకుంటున్నారో, తెలుగుదేశం అనుకుంటున్నారో కాని, చంద్రబాబు పేరు వింటేనే, చంద్రబాబు వేసే రాజకీయ ఎత్తులు చూస్తుంటేనే, తెరాస నాయకులకు వణుకు మొదలైంది. అందుకే 0.0001 % ఓటింగ్ కూడా లేని చంద్రబాబు పై, ఈ రోజు ఒకరి తరువాత ఒకరు ఎగబడ్డారు. బాల్కసుమన్ అనే ఒక లో క్లాస్ నాయకుడు గురించి వినే ఉంటారు. టీవీ స్టూడియోల్లో కుట్టుకున్న మహా ఘనుడు. ఇలాంటి వాడిని తీసుకెళ్ళి ఎంపీ చేసిన కెసిఆర్ కి ముందు ఒక దండం పెట్టాలి. ఇలాంటి లో క్లాస్ నాయకుడు అయిన బాల్కసుమన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పై రెచ్చిపోయాడు.

balka 15092018 3

ఒక వేళ ఎంపీ కాకుండా ఉంటే, బెజవాడ తీసుకోవచ్చి, ఏది కొయ్యలో అది కోసి చేతిలో పెట్టేవారు ఆంధ్రా పోలీస్.. ఆ విధంగా రెచ్చిపోయాడు బాల్కా. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం తిష్ట వేసిందని, అక్కడ దోచుకున్న సొమ్మును తెలంగాణలో ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బాబు కుట్ర పన్నాడని, ఈ అధికారులను వెంటనే ఏపీకి పంపేయాలని డీజీపీ, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని బాల్క సుమన్ తెలిపారు. అయితే, ఈ లో క్లాస్ ఫెలోకి, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సోయ కూడా లేకుండా, ఏపి పోలీస్ అంతు చూస్తాం అనే కాడికి వచ్చాడు. ఇలాంటి అలగా జనంతో, కెసిఆర్ ఏమి సాధిస్తాడో ఆయనకే తెలియాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read