బండ్ల గణేష్... ఈయన పేరు తెలియని పవన్ కళ్యాణ్ అభిమాని ఉండడు.. ఎప్పుడు అవకాసం వచ్చినా, పవన్ కళ్యాణ్ భజన మాములుగా చేసే వాడు కాదు... మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఇస్ పవన్ కళ్యాణ్ అంటూ హంగామా హంగామా చేసే వాడు. నాకు పవన్ దేవడు అంటూ, ఒక రకమైన ఉన్మాదం చూపించే వాడు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత కూడా, మా పవన్ ఒక గాంధీ, మా పవన్ ఒక వివేకానంద అంటూ, భజన చేసిన కచేరీలు ఎన్నో.. ఇలాంటి బండ్ల గణేష్ ఈ రోజు ఉన్నట్టు ఉండి కాంగ్రెస్ లో చేరుతునట్టు ప్రకటించారు. అంతే కాదు, ఢిల్లీ కూడా వెళ్ళిపోయారు.
బండ్ల గణేష్‌తోపాటు టీ పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పలువురు సీనియర్ నేతలు నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. ఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం అధ్యక్షుడు రాహుల్ నివాసానికి వెళ్లిన ఇద్దరు ఆయన సమక్షంలో తమ మద్దుతుదారులతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఫస్ట్ టైం మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని నిర్మాత బండ్ల గణేష్ కొనియాడారు. ఎన్నికల్లో పార్టీ కోరితే పోటీ చేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా.. షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండ్ల గణేష్ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా బండ్ల చెప్పారు. జనసేనలో చేరకుండా, కాంగ్రెస్ లో ఎందుకు చేరారు అంటే, దానికి బండ్ల మాట్లాడుతూ, "సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ నాకు తండ్రిలాంటి వారు. ఆయన నాకు దేవుడితో సమానం. ఆయనే నాకు గురువు. కాని రాజకీయాల్లో, కాంగ్రెస్ అంటే నాకు అభిమానం." అంటూ బండ్ల గణేష్ చెప్పారు. ఎంతో మంది విశ్లేషకులు చెప్పేది కూడా ఇదే. అప్పుడు చిరంజీవి అయినా, ఇప్పుడు పవన్ అయినా, ఒక సినిమా ఆక్టర్ గా అందరూ అభిమానిస్తారు, కాని ఓటు మాత్రం, ఎవరికి వేస్తే రాష్ట్రం బాగుపడుతుందో, వారికే వేస్తారు. చిరంజీవి లాంటి వాడికే 18 వస్తే, పవన్ కళ్యాణ్ కి సున్నా రావటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని, పవన్ వెనుక ఉండే సంగం మందికి ఓటు హక్కు కూడా ఉండదని, మిగతా సగం మంది రాష్ట్ర శ్రేయస్సు కోరేవారికి ఓటు వేస్తారని, చివరకు పవన్ వెంట ఉండే 5-10 శాతం మంది కూడా ఓటు వెయ్యరని, అది చిరంజీవి విషయంలోనే తేలిపోయింది అని, పవన్, చిరంజీవి కంటే గొప్ప వారేం కాదు కదా అని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.