ఆమె తెలంగాణా తెలుగుదేశం పార్టీలో కీలక నేత.. ఎన్ని ఆటు పోట్లు వచ్చినా, తెలుగుదేశం పార్టీని విడవకుండా నిలబడ్డారు. అయితే, ఇక కమలం పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడి ఆమె తట్టుకోలేక పోయింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఒక భావోద్వేగపు లేఖ రాసారు. ఆ లేఖ చూస్తే, ఆమె ఎంత భారంగా పార్టీ వీడుతున్నారో అర్ధమవుతుంది. చంద్రబాబు వల్ల పదవులు పొంది, మంత్రులు అయ్యి, ఎమ్మెల్యేలు అయ్యి, చివరకు సియంలు కూడా అయ్యి, డబ్బు సంపాదించుకుని , చివరకు పార్టీ మారుతూ, చంద్రబాబుని తిట్టిన తిట్టకుండా వెళ్ళే వారే కాని, రేవంత్ రెడ్డి, సీతక్క తరువాత, అంతగా చంద్రబాబు పై కృతజ్ఞత చూపింది ఈమె. ఆమె, తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా నేత, బండ్రు శోభారాణి. పార్టీని వీడుతూ చంద్రబాబుకు రాసిన లేఖ ఇది....
"15 సంవత్సరాలుగా మీ వెన్నంటి ఉండి, మీతో కలసి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆహర్నిషలు ఓ సైనికురాలిగా పనిచేశా..పార్టీ అడుగు జాడల్లో నడుస్తూ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండ పాటించా..ఏలాంటి పదవులను ఆశించకుండా గ్రామాల్లోని నా పార్టీ కుటుంబ సభ్యులును కలసి మీరు చేస్తున్న అభివృద్ధి పనులను స్పష్టంగా వివరించాను. ఒకవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో కూడా పచ్చజెం డా భుజాన పెట్టుకొని పార్టీయేనా శ్వాసగా ముందు కుసాగాను. ఎన్నో ఆటు పోట్లు, తెలంగాణ ద్రోహులని ప్రజలు చీదరించుకున్నప్పటికినీ వెనుకడుగు వేయకుండా ముందుకు కదిలి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకా కూడా పార్టీనే నమ్ముకొని ఇప్పటి వరకు కొనసాగాను. 15 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడవడం అదృష్టంగా భావిస్తున్నా..
ఎన్నో పార్టీ పదవులను కట్టబెట్టిన అధ్యక్షుడికి రుణపడి ఉంటాను. ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు చేసి పరిష్కారం దిశగా పాటుపడ్డాను, ఆలేరు ప్రజలతో మమేకమై సాగు తాగు జలాల కోసం పాదయాత్రలు, నిరసన దీక్షలు, జిల్లా ఏర్పాటుకై పాదయాత్ర, కరువు జిల్లా కోసం పోరాటంతో పాటు పలు ఉద్యమాలు నిర్వహించినా..రాజకీయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఆలేరు ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పాటుపడుతున్నా.. అధ్యక్ష అర్ధం చేసుకొని మన్నించు.. 15 సంవత్సరాల తెదేపా పార్టీని వీడిపోతున్నా..రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షురాలిగా పదవులతో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా..మీతో కలసి పనిచేశాను. ఇన్నేళ్లుగా ఆడబిడ్డగా ఆదరించారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వానికి ప్రత్నాన్మయం భాజపానే ఉంది. అందుకే కమలం వైపు అడుగులు వేస్తున్నానంటూ పార్టీ అధ్యక్షుడికి తన రాజీనామా పత్రాన్ని పంపించి తన తెదేపాలో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.