2009 ఎన్నికల్లో ఆమె ఒక సంచలనంగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, చిరంజీవిలకు వచ్చినంత పేరు అప్పట్లో ఈమెకు వచ్చింది. కారణం ఏంటో తెలుసా, ఆమె చిరంజీవి లాంటి నేతను ఓడించింది. అప్పట్లో పార్టీ పెట్టిన కొత్తలో చిరంజీవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిని ఓడించి ముఖ్యమంత్రి అయిపోతారా అనేంత, హైప్ ఉండేది. చివరకు అది గాలి బుడగ అని తేలిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అయితే, చిరంజీవి లాంటి నేతను, గోదావరి జిల్లాల్లో ఓడించటం అనేది, మామూలు విషయం కాదు. ఆమె పేరే, బంగారు ఉషారాణి... 2009 ఎన్నికల్లో, పాలకొల్లు కాంగ్రెస్ అభ్యర్థిగా, చిరంజీవి పై గెలిచారు.
అప్పట్లో జెయింట్ కిల్లర్ అంటూ కూడా ఈమెను అభివర్ణించారు కొందరు. 2014లో ఓడిపోయిన తర్వాత ఈమె మళ్ళి రాజకీయాల్లో కనపడలేదు. ఇక అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఉషారాణి ఏ పార్టీలో చేరతారు అనేది కూడా ఎవరికి స్పష్టత లేదు. ఆమె కూడా ఈ విషయంలో తటస్థంగానే ఉన్నారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీలో చేరాలని ఉషారాణి భావిస్తున్నారట. ఈ విషయంపై కొందరు తెలుగుదేశం నాయకులు కూడా ఆమెను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ కనుక, గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తే, ఈమెను పవన్ కళ్యాణ్ పై పోటీకి నిలిపే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. టిడిపి నుంచి ప్రపోజల్ వచ్చిందో లేక...తనంతట తానుగా ఆ పార్టీలో చేరాలనుకుంటున్నారో తెలియదు కానీ ఆమె అయితే తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని అక్కడి నేతలు గట్టిగా చెబుతున్నారు. పవన్ పై పోటీకి దింపితే, చిరంజీవిని ఓడించిన మహిళగా, పవన్ పై ఒత్తిడి పెంచే అవకాసం ఉంటుందని భావిస్తున్నారు. సహజంగా, పెద్ద స్థాయి నాయకులు, ఒకే స్థానం నుంచి పోటీ చేస్తారు. కాని చిరంజీవి మాత్రం, రెండు స్థానాల నుంచి పోటీ చేసి, ఒకదాంట్లో ఓడిపోయారు. మరి పవన్ కళ్యాణ్ కూడా, రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారా అనేది చూడాలి. మొత్తానికి, ఈమె రీ ఎంట్ర్రీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.