ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో రెండు రోజులు క్రిందట జరిగిన వింత పరిస్థితి చూసి, దేశం మొత్తం షాక్ అయ్యింది. ఏకంగా కేంద్ర మంత్రి ఫోన్ చేసి, హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త పోయటం పై, సంచలనంగా మారింది. ఏపి ప్రభుత్వం ఇచ్చే పధకాలకు, బ్యాంకులు రుణాలు ఇవ్వాలి అంటూ, ప్రభుత్వం ఒత్తిడి చేయటం, ఆ రుణం మేము ఇవ్వలేం అని బ్యాంకులు చెప్పటంతో, ఏకంగా బ్యాంకుల ముందే ప్రభుత్వ అధికారులు చెత్త పోయించి, ఇదే తమ నిరసన అంటూ, ఏకంగా జాతీయ బ్యాంకులను కూడా హడలేత్తించే ప్రయత్నం చేసారు. అయితే ఏపిలో జరిగిన ఈ చెత్త పని పై కేంద్రం సీరియస్ అయ్యింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గనకి ఫోన్ చేసి, జరిగిన ఘటన పై సీరియస్ అయ్యారు. అంతే కాదు, ఏకంగా దీని పై కేంద్రం కూడా విచారణ ప్రారంభించింది. అయితే ఈ విచారణలో, ఈ పని చేయమని చెప్పింది ఒక ఉన్నతాధికారిగా కేంద్రం గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ పని మొత్తానికి, కింద స్థాయి సిబ్బందిని బాధ్యులని చేసే ప్రయత్నం జరుగుతూ ఉండగా, కేంద్రం ఈ విషయం పై తమ స్థాయిలో ఎంక్వయిరీ చేయగా, ఒక ఉన్నతాధికారి అత్యుత్సాహం ఈ పరిస్థితికి దారి తీసినట్టు చెప్తున్నారు.

banks 27122020 2

ఇటీవల కాలంలో, కలెక్టర్లతో ఒక సమావేశం జరగగా, ఆ సమావేశంలో బ్యాంకులు సరిగ్గా స్పందించటం లేదని, ప్రభుత్వం రుణాలు ఇవ్వమని చెప్పినా, రుణాలు ఇవ్వటం లేదనే ప్రస్తావన రాగా, అలాంటి బ్యాంకుల అంతు చూడాల్సిందే అంటూ, ఆ అధికారి ఆ సమావేశంలో మాట్లాడారని తెలిసింది. అప్పటి నుంచి బ్యాంకుల పై జిల్లా స్థాయిలో అధికారుల నుంచి ఒత్తిడి మొదలైందని, అందులో భాగంగానే, కృష్ణా జిల్లాలో ఏకంగా బ్యాంకుల ముందు చెత్త పోసి, నిరసన తెలిపారు. అలాగే ఈ ఘటన జరగటానికి ముందు కూడా, ఆ అధికారి బ్యాంకర్లతో సమావేశం అయిన సందర్భంలో, మేము చెప్పినట్టు వినకుంటే, మీ బ్యాంకుల ముందు చెత్త పోయిస్తా, కరెంటు, వాటర్ కట్ చేపిస్తానని వార్నింగ్ ఇచ్చారని, ఆ సమావేశంలోనే బ్యాంకర్లు షాక్ అయ్యారని సమాచారం. అయితే తరువాత ఈ చెత్త సంఘటన జరిగింది. మొత్తానికి కొంత మంది ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధినేతల మన్ననులు పొందటానికి చేసిన పని, ఇప్పుడు వారి మెడకే చుట్టుకునేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఈ చర్య పై సీరియస్ అవ్వటంతో, ఆ అధికారి పై త్వరలోనే చర్యలు ఉంటాయనే టాక్ నడుస్తాంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read