నవ్యాంధ్ర రాజధాని అమరావతితో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, టౌన్ లలో పచ్చదనం, సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమవరతిని మహానగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ(బ్లూ-గ్రీన్) ఉట్టిపడేవిధంగా అద్భుతంగా నిర్మించాలన్న ధృడ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే విజయవాడ, గుంటూరు, అమవారతిలో పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడక దారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి.

beautifiaction 27112017 2

గన్నవరం వెళ్ళే రహదారి ఎంతో ఆహ్లదకరంగా పచ్చదనం పరుస్తూ, స్వాగతం పలుకుతుంది. రకరకాల పూల మొక్కలు, పచ్చని చెట్లతో హైవే కళకళలాడుతోంది... అలాగే విజయవాడలోని అన్ని ప్రభుత్వ భావనల గోడలకు రంగు రంగుల బొమ్మలు వేస్తూ, మంచి లుక్ తీసుకువస్తున్నారు... మొన్నటిదాకా విజయవాడ బందర్ రోడ్డు లో మాత్రమే ఇలా గోడలకి రంగులు వేసారు... ఇప్పుడు ఏలూరు రోడ్డు వైపు కూడా వేస్తున్నారు... గుణదల కరెంటు ఆఫీస్ తో పాటు, సిద్ధర్దా మెడికల్ కాలేజీ గోడలకి కూడా రంగులు వేస్తూ చేస్తున్న సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి.

beautifiaction 27112017 3

అమరావతి ఒక్కటే కాకుండా, అన్ని పెద్ద నగరాల్లో, పట్టణాల్లో ఇలా చేస్తున్నారు... అలాగే ఒంగోలు లాంటి చిన్న నగరంలో ఫ్లైఓవరు ఒకటే కాదు ఇంచుమించుగా ప్రతీ వీధిలో గోడలపై పెయింటింగులు వేయించారు.. అలా అని చెప్పి ఏవో పెయింటింగ్లు వేయలేదు మనదైన చరిత్ర, వారసత్వాన్ని ప్రతిభింభించేలా, మన రాష్ట్రంలో ఉన్న కోటలు బొమ్మలు, పండుగుల గురించి, మన సంప్రదాయం, గుడిలు ఇలా మన రాష్ట్రాన్ని ప్రతిభంబించేలా బొమ్మలు వేస్తున్నారు... పక్క రాష్ట్రాలులాగా ఎవరో వచ్చినప్పుడు మాత్రమే హడావిడి చెయ్యకుండా, ప్రణాలికాబద్ధంగా, నిరంతరం కొనసాగిస్తున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read