బహ్రెయిన్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బహ్రెయిన్‌లోని ఓ భవనం రెండో అంతస్తులో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా నేలమట్టమైందని పోలీసులు తెలిపారు. భవన శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోనని సహాయక బృందాలు గాలిస్తున్నాయి. బహ్రెయిన్ దేశంలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా, సుమారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు.
ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో గ్యాస్ సిలిండ్ పేలి ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు ధాటికి భవనం నేలమట్టమైంది. ఈ సమాచారం మేరకు సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించాయి. భవన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోననే అనుమానంతో తక్షణ చర్యలు ప్రారంభించాయి.
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు. మృతుల్లో తెలుగువారు ఉన్నారంటూ వెలువడుతున్న మీడియా కథనాల నేపథ్యంలో ఏపీ భవన్ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. ఈ విషయమై బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించానని, మృతులందరూ బంగ్లాదేశ్ కు చెందిన వారేనని రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఒకవేళ తెలుగువారు బాధితులుగా ఉంటే వెంటనే వారిని ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.