రాష్ట్రంలోని మొక్కజొన్న, జొన్న రైతులకు ధర రాయితీ పథకం (పీఎస్‌ఎస్‌)లో రూ.259 కోట్ల ప్రోత్సాహకం అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గురువారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మొక్కజొన్న, జొన్న ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో పీఎస్‌ఎస్‌ పథకంలో క్వింటాలుకు రూ.200 చొప్పున (ఒక్కో రైతుకు గరిష్ఠంగా 100 క్వింటాళ్ల వరకు) సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా ఈ పంటలు సాగు చేసిన రైతుల వివరాలు నమోదు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 2.96 లక్షల మంది రైతులు సుమారు 128 లక్షల క్వింటాళ్లకు ప్రోత్సాహకం కోరుతూ పేర్లు నమోదు చేసుకున్నారు.

farmers 02082018 2

జులై మొదటి వారం నుంచి అధికారులు గ్రామాలకు వెళ్లి పరిశీలించి తుది జాబితాలు తయారు చేశారు. తొలుత నమోదైన వివరాల ప్రకారం రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.265 కోట్లుగా అంచనా వేయగా.. తుది పరిశీలనలో రూ.259 కోట్లుగా లెక్క తేల్చారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13.72 లక్షల క్వింటాళ్ల జొన్న, 33.45 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న ఉత్పత్తిపై ప్రోత్సాహక నిధుల కోసం రైతులు నమోదు చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఒక్క క్వింటాలు కూడా నమోదు కాలేదు. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 100 క్వింటాళ్లకు రూ.20 వేల వరకు అందనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read