ఒక పక్క కనకదుర్గా ఫ్లై ఓవర్ పనులు నెమ్మదిగా జరుగుతూ, ప్రజల సహనాన్ని పరీక్షిస్తుంటే, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.. జూన్ 12, 2017న ప్లై ఓవర్ పనులకు శ్రీకారం చుట్టగా, ఏడు నెలల కాలంలో, చాలా పురోగతి కనిపిస్తుంది... దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ జెట్‌ స్పీడ్‌గా పనులు చేస్తుంది... మరో ఏడె నిమిది నెలల్లోనే అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది... ఆగస్టు, సెప్టెంబర్‌ నాటికి ఫ్లైఓవర్‌ను అప్పగిస్తామని కాంట్రాక్టు సంస్థ ఎన్‌హెచ్‌ అధికారులకు చెబుతోంది...

benz circel 30012018 2

ఇప్పటి వరకు బెంజిసర్కిల్‌ పార్ట్‌-1 మొదటి వరుస పనులు, ఏడు నెలల్లో 22 శాతం మేర పనులు పూర్తయ్యాయి... ఫ్లై ఓవర్‌ పార్ట్‌-2 పనులకు నవంబర్‌ రెండవ వారంలో టెండర్లు పిలవనున్నారు. పార్ట్‌-1, మొత్తం 600 మీటర్ల పొడవున నిర్మలా కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి, ఎస్‌వీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ జంక్షన్‌ వరకు పూర్తిగా ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్‌ మధ్యన పనులు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి మొత్తంగా 354 ఫైల్స్‌ వేయా ల్సి ఉంది. ఇప్పటి వరకు 242 ఫైల్స్‌ వేశారు. ఫైల్స్‌ అన్నవి భూమిలో వేసే పిల్లర్లు. ఫైల్స్‌ తర్వాత దశలో వీటన్నిం టినీ కలిపి భూమి నుంచి పైకి మొత్తం 49 ఫైల్‌ క్యాప్స్‌లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 18 ఫైల్‌ క్యాప్స్‌ పనులను పూర్తి చేశారు.

benz circel 30012018 3

ఫ్లైఓవర్‌కు ప్రధాన మైన పియర్స్‌ (పిల్లర్లు) మొత్తం 49 కాగా.. ఇప్పటి వరకు 11 పూర్త య్యాయి. పియర్స్‌ క్యాప్స్‌ అంటే పిల్లర్ల మీద వేసే తలలు మొత్తం 49 కాగా ఇప్పటి వరకు రెండు పూర్తయ్యాయి. మరో 10 తలల నిర్మాణానికి ఐరన్‌ ఫ్రేమింగ్‌ చేశారు. ఆ తర్వాత దశలో గడ్డర్ల తయారీ జరగాలి. మొత్తం 240 గడ్డర్లను తయారు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 93 గడ్డర్లు పూర్తయ్యాయి. కీలకమైన పియర్స్‌, క్యాప్స్‌ పనుల ఘట్టం ప్రారంభమైంది! నిర్మాణ పనులు ఈ ఏడాది నవంబర్‌ నాటికి పూర్తి కావాల్సి ఉండగా రెండు నెలలు ముందుగానే ఆగస్టు నాటికి అప్పగించటానికి కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ సమాంతర పనులు ప్రారంభించింది..

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read