విజయవాడ ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రెండు హైవేలు వెళ్ళే సిటీ కూడా బహుసా, ఈ దేశంలో విజయవాడ ఒక్కటే ఏమో. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో, దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం, ప్రజలు ఉద్యమాలు చేసినా, ఎవరూ పట్టించుకోలేదు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం, ప్రభుత్వం కార్యకలాపాలు ఇక్కడ నుంచే మొదలు కావటం, ఆ తరువాత అమరావతి రాజధానిగా చెయ్యటం, గన్నవరం నుంచి పెరిగిన ట్రాఫిక్ ఇవన్నీ, ద్రుష్టిలో ఉంచుకుని, కేంద్రంతో పోరాడి, అటు దుర్గ గుడి ఫ్లైఓవర్ తో పాటుగా, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పనులకు ఒకే చెప్పించారు. చంద్రబాబుతో పాటుగా, విజయవాడ ఎంపీ కేశినేని నాని కృషి ఈ ప్రాజెక్ట్ లో ఎంతో ఉంది. ముఖ్యంగా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, ముందుగా కేవలం నిర్మలా కాన్వెంట్ సెంటర్ వరుకే అని అనుకున్నారు. తరువాత కేశినేని నాని, కేంద్రంతో పోరాడి, వినాయక దియేటర్ వరకు ఫ్లైఓవర్ వచ్చేలా చేసారు. తరువాత చంద్రబాబు, దీన్ని రామవరప్పాడు వరకు తీసుకు వెళ్ళాలని చూసినా, కుదరలేదు.
అయితే ఒక పక్క కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు ఇంకా జరుగుతూ ఉండగానే, ఇప్పుడు లేట్ గా మొదలైన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తయ్యింది. ఎన్నికల ముందే 95 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు పూర్తీస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ ట్రాఫిక్ లో ఇబ్బంది పడే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా గన్నవరం వైపు నుంచి వచ్చే లారీలు, ఇక నుంచి సిటీలోకి ఎంటర్ అవ్వకుండా, వినాయక ధియేటర్ వద్ద నుంచి ఫ్లైఓవర్ ఎక్కి, కిందకు దిగుతాయి. దీంతో, బెంజ్ సర్కిల్ మీద అధిక ఒత్తిడి తగ్గే అవకాసం ఉంది. అయితే, రెండో వైపు ఫ్లైఓవర్ మాత్రం, ఇంకా టెండర్ వరకు కూడా రాలేదు. అది కూడా అయితే కాని, పూర్తీ స్థాయిలో ఉపయోగం ఉండదు.
ఇది ఇలా ఉండగా, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కేవలం, ఫోర్ వీలర్స్, హెవీ వెహికల్స్ కు మాత్రమే. టు వీలర్స్ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళటానికి లేదు. ఈ రోజు మొదలు కానున్న ఫ్లైఓవర్ పై వెళ్ళటానికి, హుషారుగా వచ్చిన యువత, ఈ వార్త తెలుసుకుని, అవాక్కయ్యారు. ప్రాజెక్ట్ ఇంప్లెమెంటేషన్ డైరెక్టర్ విద్యా సాగర్ మాట్లాడుతూ, ఈ ఫ్లై ఓవర్ పై, కేవలం ఫోర్ వీలర్స్, హెవీ వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని, టు వీలర్స్ కు ఫ్లైఓవర్ పై అనుమతి లేదని చెప్పారు. పోలీసులు ఈ విషయం పై, అక్కడ అవగాహన కలిగిస్తారని చెప్పారు. "three-lane road with paved shoulder " ఉన్న కారణంగా టువీలర్స్ కు అవకాసం లేదని చెప్పారు. అయితే ప్రస్తుతం ట్రయిల్ రన్ మాత్రమే జరుగుతుందని, లోపాలు ఏవైనా ఉంటే సరి చేసి, త్వరలో కేంద్రం మంత్రి గడ్కరీతో, ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు.