ఎన్నికల వేడి మళ్లీ రాజుకుంటోంది. నెల రోజుల క్రితం జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఈనెల 23న ఓట్ల లెక్కింపు నిర్వహించనుండడంతో ఒక్కసారిగా బెట్టింగ్‌రాయుళ్లలో హుషారు కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం వైపు నుంచి బెట్టింగ్‌ వేసేందుకు పలువురు ముందుకు వస్తుండగా.. వైసీపీ శ్రేణుల్లో మాత్రం దూకుడు తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగి బెట్టింగ్‌కు పలువురు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో వైసీపీ గెలుపుపై బెట్టింగ్‌ కట్టేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలియవచ్చింది. ఆ పార్టీ తరపున ఇప్పటికే బెట్టింగ్‌ కట్టిన వారు తమ సొమ్ము వెనక్కు ఇవ్వాలని కొందరి వెంట పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా పూర్తిస్థాయి సమాచారం తమవద్ద ఉన్నప్పుడే బెట్టింగ్‌ రూపంలో డబ్బు కట్టేందుకు ఎవరైనా సిద్ధపడతారు.

game 27032019

అయితే ఏప్రిల్‌ 11న జరిగిన పోలింగ్‌ అనంతరం వైసీపీ గెలుస్తుందని ప్రచారం చేసుకోవడంలో ఆ పార్టీ శ్రేణులు సక్సెస్‌ అయ్యాయి. దీంతో ఆ ప్రచారం ఉచ్చులో పడి పలువురు ఆ పార్టీ తరపున బెట్టింగ్‌కు సిద్ధపడ్డారు. అయితే వేడి తగ్గేకొద్దీ వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూండడంతో పందెంరాయుళ్లలో దడ పట్టుకుంది. దీంతో ఇప్పటికే పందెం కట్టిన వారు తమ సొమ్ము వెనక్కుఇవ్వాలని బేరసారాలు మొదలు పెట్టినట్లు సమాచారం, తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలున్నాయనే సంకేతాలు అందుతున్నాయని భావించి సొమ్ము వెనక్కు అడుగుతున్నట్లు తెలిసింది. 20 రోజుల క్రితం వైసీపీ గెలుస్తుందని రూ. 5 లక్షలు బెట్టింగ్‌ కట్టిన ఓ వైసీపీ నాయకుడు ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుని బెట్టింగ్‌ సొమ్ము వెనక్కు ఇవ్వాలని మధ్యవర్తి వెంటపడినట్లు తెలిసింది.

game 27032019

అలాగే మరికొందరు మొన్నటి వరకు వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్‌ కట్టేందుకు ముందుకొచ్చి చేతిలో రూ. పది లక్షల వరకు పెట్టుకుని టీడీపీ వైపు నుంచి బెట్టింగ్‌ కట్టే వారి కోసం నిరీక్షించారు. క్రమేపీ వాతావరణంలో మార్పు కనిపించడంతో ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుని వారు కూడా టీడీపీ గెలుస్తుందనే అంచనాకు వచ్చి ఆ పార్టీ వైపు నుంచి రూ. పది లక్షలు బెట్టింగ్‌ కట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే వైసీపీ నుంచి బెట్టింగ్‌ కట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, ముందుగా కట్టిన సొమ్మే వెనక్కు అడుగుతున్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా బెట్టింగ్‌ రాయుళ్లలో ముందు కనిపించిన వేడి ఇప్పుడు కనిపించడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని బెట్టింగ్‌ కట్టేందుకు మాత్రం ఆ పార్టీలోని కొందరు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తటస్థులు సైతం టీడీపీ వైపే బెట్టింగ్‌కు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ వైపు ఉన్న పందెంరాయుళ్లు యూటర్న్‌ తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. వైసీపీ గెలుస్తుందనే ధీమాతో ఉన్న వారు సైతం డీలాపడడం వెనుక ఒక్కొక్కటిగా వస్తున్న సర్వేలే కారణమని తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read