ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా, భారత దేశాన్ని క-రో-నా మహమ్మారి చిన్నాభిన్నం చేస్తుంది. ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయాని, సొంత పార్టీ నేతలే మాట్లాడుకునే పరిస్థితి. వాస్తవ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆక్సిజన్ అందక సంభవిస్తున్న మరణాలు, ప్రభుత్వాల పని తీరుకు అద్దం పడుతున్నాయి. ఒక పక్క బెడ్స్ కూడా దొరకని పరిస్థితి. ప్రజలు కళ్ళ ముందే పిట్టల్లా రాలి పోతున్నారు. అయిన వారికి దూరం అవుతున్నారు. చివరి చూపు కూడా దక్కటం లేదు. ఇలాంటి ఎన్నో దౌర్భాగ్యమైన పరిస్థితితులు మాన్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వాలు ఇంతకంటే ఏమి చేయలేవ్ అని డిసైడ్ అయిన ప్రజలు, ఇప్పుడు వ్యాక్సిన్ పైనే ఆధార పడుతున్నారు. వ్యాక్సిన్ ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్రం పంపించే టీకాలు తప్పితే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదు. అదేమంటే మేము వ్యాక్సిన్ కంపెనీలకు లేఖలు రాశామని, లేఖలు చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చి, టీకాలు తీప్పించుకుంటున్నాయి. అడ్వాన్స్ ఇచ్చిన కేరళ లాంటి రాష్ట్రాలకు, ఇప్పటికే డెలివర్ కూడా చేసారు. ఇదే విషయం పై జగన్ మోహన్ రెడ్డిని, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే, ఎప్పటి లాగానే, దీనికి కూడా చంద్రబాబు నాయుడు కారణం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసారు.

bb 12052021 2

ఏకంగా నిన్న జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, భారత్ బయోటెక్ చంద్రబాబు బంధువుది అని, రామోజు వియ్యంకుడిది అని, అక్కడ ఏమి జరుగుతుందో వారికి తెలవదా అంటూ, చంద్రబాబు వల్లే వ్యాక్సిన్ లు లేట్ అవుతున్నాయి అనే విధంగా స్పందించారు. నిన్న జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడుతారని ఎవరూ ఊహించలేదు. అయితే ఇన్నాళ్ళు తమ పై విమర్శలు చేస్తున్నా, కేవలం వ్యాక్సిన్ ఉత్పత్తి పైనే ఫోకస్ పెట్టిన భారత్ బయోటెక్, ఇప్పుడు తమ పై వస్తున్న ఆరోపణల పై స్పందించింది. డైరెక్ట్ గా జగన్ పేరు పెట్టి కాకుండా, పరోక్షంగా స్పందిస్తూ, సుచిత్ర ఎల్లా ట్వీట్ చేసారు. ఇప్పటికే తమ టీకాను 18 రాష్ట్రాలకు పంపామని అన్నారు. తమ సంస్థకు సంబంధించి 50 మంది వైరస్ బారిన పడినా కూడా, ఈ లాక్ డౌన్ సమయంలో కూడా, 24 గంటలు కష్టపడి వ్యాక్సిన్ ఉత్పత్తికి ప్రయత్నం చేస్తున్నామని, ఇంత చేస్తున్నా, తమ పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దురుద్దేశాలు ఆపాదించటం దురదృష్ట కరం అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read