ఉన్నట్టు ఉండి వైసీపీ పార్టీలో గత నెల రెండు నెలలుగా తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ప్రజలు అన్ రెస్ట్ కి లోనవుతున్నారు. పెరిగిన అన్ని రకాల చార్జీలు, సంక్షేమం కోతలు, దారుణమైన రోడ్డులు, శాంతి భద్రతలు, ఇలా అన్ని విషయాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే పోటీలేని స్థానిక సంస్థల ఎన్నికల గురించి, మేమే గెలిచాం అంటూ డబ్బా కొడుతున్నా, వైసీపీ నేతలకు మాత్రం గ్రౌండ్ రియాలటీ అర్ధం అయిపోయింది. వైసీపీ నేతలు కూడా ఇప్పుడు కంట్రోల్ తప్పుతున్నారు. ఏదో సాదా సీదా నేతలు అంటే అనుకోవచ్చు, ఏకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థాయిలోనే బహిరంగంగా నువ్వు ఇలా అంటే నువ్వు ఇలా, నువ్వు ఇంత తిన్నావ్ అంటే నువ్వు ఇంత తిన్నావ్ అంటూ బహిరంగంగా ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శలు చేసుకుంటున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య గత కొంత కాలంగా వార్ నడుస్తూనే ఉంది. ఆవ భూములు స్కాం ఎంపి బయట పెట్టాడని, జక్కంపూడి రాజా వర్గం గుర్రుగా ఉంది. అవకాశం కోసం చూస్తున్న వారికి, అద్భుతమైన అవకాసం దొరికింది. జగన్ మోహన్ రెడ్డిని సిబిఐ కేసులో అరెస్ట్ చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయాణ అంటే, వైసీపీ వర్గాలకు ఎంత కోపమో అందరికీ తెలిసిందే. వైసీపీ నేతలు చంద్రబాబుతో లింక్ చేసి తిడుతూ ఉంటారు.
అలాంటి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణతో, భరత్ సేల్ఫీ దిగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అవకాసం కోసం చూస్తున్న జక్కంపూడి రాజా, ఇదే అదునుగా, పార్టీని నాశనం చేస్తున్నావ్ అని, జగన్ ని ఇబ్బంది పెట్టిన వారితో సేల్ఫీలు ఎలా దిగుతావ్ అంటూ మండిపడ్డారు. చీకటి రాజకీయాలు చేస్తూ, పార్టీకి చెడ్డ పేరు తెస్తూ, పార్టీని నాశనం చేస్తున్నారని అన్నారు. అలాగే తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా చేసారు. ఇప్పటికే మనకు ఒక ఆర్ఆర్ఆర్ ఉన్నాడని, ఇప్పుడు ఇంకో ఆర్ఆర్ఆర్ అవసరం లేదని అన్నారు. దీని పై భరత్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, జక్కంపూడి చరిత్ర మొత్తం బయట పెట్టారు. జక్కంపూడి రాజా, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, పార్టీ లైన్ ఎప్పుడూ దాటలేదని అన్నారు. చిన్న పిల్లోడిలో మాట్లాడటం ఆపాలని అన్నారు. కాపుల సమావేశంలో లక్ష్మీనారాయణ వచ్చి తనని కలిసారని, ఆయన తన దగ్గరకు వచ్చారని, అప్పుడు ఫోటో దిగామని, ఇవన్నీ వీడియోలో కూడా ఉన్నాయని అన్నారు. అలాగే అవినీతి ఆరోపణలు కూడా చేసారు. మొత్తానికి ఇద్దరు నేతలు, ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసి, ఎంత తినేసారో బయట పెట్టారు.