జగన్ మోహన్ రెడ్డి ఇన్నిరోజులు ప్రత్యేక హోదా పేరుతో కాకమ్మ కబుర్లు చెప్పి కాలం వెల్లబుచ్చారు.... నిన్న పార్లమెంటులో తెలుగుదేశం ఎంపిల పోరాటం చూసాక గుండెల్లో దడపుట్టి ప్రజలు పార్టీని మరిచిపోతారేమో అనే భయంతో బంద్ కి పిలుపునిచ్చారు... దీని వల్ల ప్రత్యేకహోదా వస్తదా..? కనీసం బడి పిల్లలైనా మీ బంద్ కి సహకరిస్తారా..? ఈ బంద్ వల్ల ఉపయోగమైనా ఉందా...? ఇలాంటివి ఏవి పట్టించోకోకుండా, తన నాయకుల చేత కొన్ని చోట్ల బలవతంగా బంద్ చేపించే ప్రయత్నం చేసారు. చిరు వ్యాపరులు ఒకరోజు తమ వ్యాపారాన్ని వదిలి ఇంట్లో కుర్చోవాల్సిన పరిస్థితి.. అయితే తను, తన భార్య నిర్వహించే భారతి సిమెంట్స్ మాత్రం, ఈ రోజు యధావిధగా పని చేసింది. తను మాత్రం బాగుండాలి, ప్రజలు మాత్రం పోవాలి అనే అనుకునే జగన్ నైజం బయట పడింది.
బంద్ ప్రభావం పాక్షికంగా కనిపిస్తోంది. విజయవాడలో అయితే జనజీవనం యధావిధిగా ఉంది. కేవలం విద్యాసంస్థలకు మినహాయించి మిగిలినవన్నీ యాధావిధిగా జరుగుతున్నాయి. బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. ఇలా బంద్‌లు చేయడంకంటే ఢిల్లీ స్థాయిలో నిరసనలు తెలియజేయడం, కేంద్రంపై ఒత్తిడి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ బంద్ వల్ల రాష్ట్రానికే నష్టమని, కేంద్రానికి ఎటువంటి ఇబ్బంది లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని ఏ పార్టీ కూడా వైసీపీకి మద్దతు ఇవ్వలేదు. వైసీపీ ఇటువంటి బంద్‌లు మానీ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తే బాగుంటుందని, టీడీపీ ఎంపీలు ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో అదే స్థాయిలో వైసీపీ పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మీరు ఇలా ఎంజాయ్ చేస్తుంటే, మీ స్వార్ధ రాజకీయాల కోసం, ప్రజలు బలి అవ్వాలా ? ఒక సమస్య పై, ఒకసారి బంద్ చేస్తారు.. కాని నెలకు ఒకసారి ఏంటిది ? అదీ ఢిల్లీ స్థాయిలో తేల్చుకునే విషయం, మన రాష్ట్రంలో నీ వీరత్వం చుపించటమేంటి ? ఒక్క రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసి, పార్లమెంట్ ముందు ధర్నా చేస్తాను, మీరు రండి అని పిలుపు ఇవ్వండి, అప్పుడు ప్రజలు సహకరిస్తారు. అంతే కాని, రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పడితే, మోడీకి పోయేది ఏమి ఉంటుంది ?వారికి కావాల్సింది కూడా, రాష్ట్రం ఇలా అల్లకల్లోలంగా ఉండటమే... మనం ఎందుకు వారి ఉచ్చులో పడాలి ? నువ్వు చేసే బంద్ కు, ఒక్క పార్టీ కూడా, నీకు మద్దతు ఇవ్వలేదు అంటే, మీరు చేస్తున్న పోరాటం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు... ఇకనైనా ఈ గల్లీ వేషాలు మాని, ఢిల్లీలో పోరాడండి, లేకపోతే మీ పాదయాత్ర చేసుకోండి...