భవానీ ఐల్యాండ్‌లో సరికొత్త పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి వచ్చాయి. ఓపెన్‌ మ్యూజికల్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ ఆర్కెస్ర్టాను శీఘ్రగతిన ఐల్యాండ్‌లో ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. రూ.16.5లక్షల వ్యయంతో ఓపెన్‌ మ్యూజికల్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ ఆర్కెస్ర్టాను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా ఎలక్ర్టానిక్‌ తబలా వంటివి ఏర్పాటుచేశారు. వీటిని రోజ్‌గార్డెన్‌ సమీపంలోని పాత్‌వేల వెంబడి ఏర్పాటుచేశారు. భవానీ ఐల్యాండ్‌కు వచ్చేవారిని ఇవి ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ సంగీత పరికరాలను లండన్‌ నుంచి భవానీ ఐల్యాండ్‌ కార్పొరేషన్‌ అధికారులు దిగుమతి చేసుకున్నారు.

bhavani island 11052018 2

ఈ సంగీత పరికరాలను ఐల్యాండ్‌కు వచ్చినవారు ఎవరైనా ఉచితంగా వాయించవచ్చు. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సందర్భంగా చీఫ్‌ సెక్రటరీ సతీమణి భవానీ ఐల్యాండ్‌కు వచ్చిన సందర్భంలో వీటిని ప్రారంభించటం జరిగింది. పిల్లల ను ఈ సంగీత పరికరాలు ఎంతగా నో ఆకట్టుకుంటున్నాయి. భవానీ ఐల్యాండ్‌కు వచ్చే పిల్లలు వీటిని ప్లే చేస్తున్నారు. ఏర్పాటు చేసిన సంగీత పరికరాలన్నీ ఎలక్ర్టానిక్‌వి కావటంచేత ఐల్యాండ్‌ అంతా ఈ ధ్వనులు వినిపిస్తున్నాయి. ద్వీపంలో ఇదో సరికొత్త అనుభూతిని పంచుతోంది. దీంతో పాటు ద్వీపంలో కాన్ఫరెన్స్‌ బైక్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒకేసారి ఏడుగురు సైకిల్‌ను తొక్కే అవకాశాన్ని ఈ కాన్ఫరెన్స్‌ బైక్‌ కల్పిస్తోంది. కాన్ఫరెన్స్‌ బైక్‌ను రూ. 4లక్షల వ్యయంతో చైనా నుంచి కొనుగోలు చేశారు.

bhavani island 11052018 3

సింగిల్‌గా కాన్ఫరెన్స్‌ బైక్‌ను విక్రయించటానికి చైనా అంగీకరించపోయినా.. అనేక వ్యయప్రయాసల కోర్చి దీనిని కొనుగోలు చేశారు. కొద్దిరోజుల కిందటే కాన్ఫరెన్స్‌ బైక్‌ అందుబాటులోకి వచ్చినా... ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్రస్తుతం దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చారు. భవానీ ఐల్యాండ్‌ లోని పాత్‌వేలలో దీనిపై ఎక్కి తిరిగేవిధంగా అవకాశం కల్పించారు. పాత్‌వేలలో ఏడుగురు ఒకేసారి సైకిల్‌ తొక్కటం.. అది ముందుకు కదలటం ఎంతో ఆకర్షణగా ఉంది. సీ ఐల్యాండ్‌ పార్క్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావటానికి బీఐటీసీ అధికారులు టెండర్లు పిలిచారు. వచ్చే నెలలో దీనికి సంబంధించి టెండర్లు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read