శాసానసభలో జరిగిన సంఘటన పై , తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మొదటి సారి స్పందించారు. ఈ మేరు ఆమె కొద్ది సేపటి క్రితం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లెటర్ హెడ్ పై, జారీ చేసిన ఈ పత్రికా ప్రకటనలో, శాసనసభలో తన పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారి అందరికీ పేరు పేరునా ఆమె ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తనకు జరిగిన అవమానాన్ని, ఒక తల్లికి, ఒక తోబుట్టువుకు, ఒక కూతురుకు జరిగిన అవమానంగా భావించి తనకు అండగా నిలబడిన వారి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్తూ, కృతజ్ఞతలు తెలిపారు. చిన్న తనం నుంచి తన అమ్మా నాన్న, విలువలతో పెంచారని చెప్పి, నేటికీ వాటిని పాటిస్తున్నాం అని ఈ సందర్భంగా ఆ లేఖలో పేర్కొన్నారు. విలువలతో కూడిన సమాజం కోసం, ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, కష్టాల్లోనూ ఆపదలో ఉన్న వారి అందరికీ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని భువనేశ్వరి ప్రకటనలో పేర్కొన్నారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవాన్ని భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని ఆమె చెబుతూ, తనకు జరిగిన అవమానం వేరే ఎవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.

nara 26112021 1

చాలా క్లుప్తంగా ఇచ్చిన లేఖలో, ఎంతో అర్ధం వచ్చేలా అర్ధవంతంగా రాసారు. శాసనసభలో తనకు అన్యాయం జరిగింది అని కూడా ఆమె అందులో పేర్కొన్నారు. తనకు జరిగిన ఈ అవమానం ఎవరికీ కూడా భవిష్యత్తులో జరగకూడదని పేర్కొన్నటంతో, పాటు, చిన్న తనం నుంచి విలువలతో బ్రతికాం అని, ఇప్పటికే అలాగే ఉన్నామని చెప్పటం, తన అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి పెంచిన విధానం పై ఆ లేఖలో పేర్కొన్నారు. శాసనసభలో జరిగిన అవమానం తరువాత, చంద్రబాబు మీడియా సమావేశంలో, కంటతడి పెట్టారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా నిర్ఘాంతపోయేలా చేసింది. చంద్రబాబుని ఎప్పుడూ ఇలా చూడని వారు చేలించి పోయారు. టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా, అనేక నిరసనలు చేసారు. అనేక మహిళా సంఘాలు కూడా నిరసనలు చేసాయి. అయితే ఈ నేపధ్యంలోనే కొద్ది సేపటి క్రితం ఈ పత్రికా ప్రకటన విడుదల చేసి, నిరసన తెలియచేసి, అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read