ఆమె తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటిన అన్నగారి కూతురు... ఆమె తెలుగువాడి దమ్ముని ప్రపంచానికి చాటిన చంద్రబాబు సతీమణి... అందుకే ఆమె జై జై తెలుగు తల్లి అని నినాదాలు చేసారు... ప్రాంతాలుగా విడిపోయి, తెలంగాణా, ఆంధ్రాగా తెలుగువారు ఉన్న పరిస్థుల్లో, ఇప్పటికీ రెండు ప్రాంతాలు కావలి అనుకుంటున్నది తెలుగుదేశం పార్టీ మాత్రమే... అప్పట్లో చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం అంటే హేళన చేసారు... కాని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒక ప్రాంతం వైపే పక్షపాతం చూపలేదు... ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నా, తెలంగాణా వైపు నుంచి ఎంత రెచ్చగొట్టినా, రాజకీయంగానే చూసారు కాని, ప్రాంతాల మధ్య వైరుధ్యాన్ని తన రాజకీయ మనుగడ కోసం ఎప్పుడూ వాడుకోలేదు... అదే కోవలో చంద్రబాబు సతీమణి కూడా, జై తెలుగు తల్లి అన్నారే కాని, ఒక ప్రాంతం వైపు పక్షపాతం చూపలేదు... ఈ సంఘటన నిన్న ప్రెస్ మీట్ లో జరిగింది...
నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి సందర్భంగా జనవరి 18న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలోని 150 కేంద్రాల్లో లెజెండరీ డ్రైవ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ చీఫ్ నారా భువనేశ్వరి తెలిపారు... రెండేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లెజెండరీ డ్రైవ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు... ఈ సారి ఆంధ్రా, తెలంగాలో 140 చోట్ల, 16 రాష్ట్రాల్లో 160 చోట్ల ఈ లెజెండరీ డ్రైవ్ చేస్తామని అన్నారు. ఇది ఎన్టీఆర్ కు అర్పించే గొప్ప నివాళిగా తాము భావిస్తామన్నారు.. అలాగే ఫేస్బుక్ సహకారంతో కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నామని, దీనికి ఫేస్బుక్ కూడా సహకారం అందిస్తుంది అని చెప్పారు.
నీరు లేనిదే మనిషి లేడు అని, ఫ్లోరైడ్, ఉప్పు, నీరు ఉన్న చోట 67 ఎన్టీఆర్ సుజలా ప్లాంట్స్ స్థాపించాం అని అన్నారు.. దీని ద్వారా 2 లక్షల మందికి రూ.2కే 20 లీటర్ల నీటిని అందిస్తున్నామని, మహబూబ్‌నగర్, కర్నూల్, హైదరాబాద్, విశాఖపట్నం, ఉత్తరాఖండ్ తుఫాన్ బాధితులకు 15 కోట్ల విలువైన మందులు, బట్టలు పంపిణీ చేశామని చెప్పారు... 150 శిబిరాల ద్వారా సుమారు 15 వేల మంది రక్తదానం చేసిన వారికి కృతజ్ణతలు తెలిపారు... అలాగే దీనికి సహకరించిన ఇండియన్ రెడ్‌క్రాస్, రోటరీ లయన్స్, బసవరామతారక కాన్సర్ ఆసుపత్రి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు... చివరగా జై తెలుగు తల్లి, జై ఎన్టీఆర్ అంటూ, ముగించారు...